Site icon NTV Telugu

Director KK : టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సినిమా రిలీజ్ ముందు డైరెక్టర్ ఆకస్మిక మృతి

director kk death

director kk death

టాలీవుడ్ డైరెక్టర్ కేకే అలియాస్ కిరణ్ కుమార్ ఆకస్మికంగా మృతి చెందినట్లు తెలుస్తోంది. తెలుగులో మంచు మనోజ్ హీరోగా ‘కేడి’ అనే సినిమా చేసిన ఆయన, ఆ సినిమా తర్వాత దర్శకత్వానికి సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్నారు. అయితే, ఆయన లెజెండరీ దర్శకుడు మణిరత్నం దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేస్తూ వస్తున్నారు. మణిరత్నం తెరకెక్కించే చాలా సినిమాలకు ఆయన అసోసియేట్ డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

ఈ మధ్యనే ఆయన దర్శకుడిగా మరో సినిమాను కూడా ప్రారంభించారు. శ్రీకాంత్ ఓదెల సోదరుడు శశి ఓదెల, దీక్షిత్ శెట్టి హీరోలుగా ‘కె.జె.క్యూ’ (కింగ్ జాకీ క్వీన్) అనే సినిమాను ఆయన డైరెక్ట్ చేస్తున్నారు. అయితే, ఆ సినిమా షూటింగ్ అంతా పూర్తయిపోయిన తర్వాత ఆయన కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు ఆయన కన్నుమూసినట్లు ‘కింగ్ జాకీ క్వీన్’ సినిమా టీం అధికారికంగా ప్రకటించింది.

అయితే, ఆయన ఎలా మరణించారు అనే విషయం మీద ప్రస్తుతానికి అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం లేదు. కేకే ఈ మధ్యనే నటుడిగా కూడా ఒక సినిమాలో కనిపించారు. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భద్రకాళి’. ఈ భద్రకాళి సినిమాలో కేకే ఒక సిబిఐ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. నటుడిగా ఆయన మరిన్ని సినిమాల్లో కనిపిస్తారు అనుకుంటున్న సమయంలోనే, ఆయన ఆకస్మిక మరణం సినీ వర్గాల్లో తీవ్ర షాక్ కలిగిస్తోంది.

Exit mobile version