Site icon NTV Telugu

Cine Roundup : టాలీవుడ్.. బాలీవుడ్.. కోలీవుడ్.. సినిమాల రౌండప్

Crazy Updates

Crazy Updates

Tollywood : అనంతిక సనిల్ కుమార్ లీడ్ రోల్ లో ఫణింద్ర నర్సేట్టి దర్శకత్వంలో వచ్చిన చిత్రం 8 వసంతాలు. పొయెటిక్ ప్రేమ కథగా వచ్చిన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆయితే ఈ సినిమాను మొదట కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా చేయాలనుకోగా నిర్మతలు మైత్రీ మూవీస్ నూతన నటీనటులతో చెప్పారని దర్శకుడు తాజాగా ఓ ప్రెస్ మీట్ లో వెల్లడించారు. 

Bollywood : ఇప్పటి వరకు పక్కింటి అబ్బాయిగా మెప్పించినన బీటౌన్ యాక్టర్ రాజ్ కుమార్ రావ్ నెక్ట్స్ వయలెంట్ హీరోగా మారబోతున్నాడు. మాలిక్‌తో రగ్డ్ లుక్కులో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, సాంగ్స్ రిలీజ్ కాగా, రీసెంట్లీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో మానుషి చిల్లర్ హీరోయిన్. జులై 11న థియేటర్లలోకి రాబోతుంది బొమ్మ.

Kollywood :  విజయ్ సేతుపతి కొడుకు సూర్య సేతుపతి హీరోగా ‘ఫోనెక్స్’ చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. కాగా ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ ను బుధవారం చెన్నైలో ప్రదర్శించగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సూర్య సేతుపతి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో అద్భుతంగా నటించాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కాబోతుంది.

Exit mobile version