Site icon NTV Telugu

Thug Life : ఓటిటి రిలీజ్ కోసం దిగొచ్చిన ‘థగ్ లైఫ్’ ..?

‘thug Life’ Ott Release

‘thug Life’ Ott Release

భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘థగ్ లైఫ్’ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా బోల్తా కొట్టింది. తొలి వారాంతంలో దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లు కూడా సాధించలేకపోయింది.  జూన్ 5న విడుదలైన ఈ చిత్రం పై మిశ్రమ స్పందన వెల్లువెత్తడంతో.. వసూళ్ల పై ప్రభావం చెప్పినట్లు తెలుస్తోంది. గత 5 సంవత్సరాల కమల్ కెరీర్ లో అత్యల్ప ప్రారంభ వసూళ్లు సాధించి చిత్రం ఇదే అని చెప్పవచ్చు. ముఖ్యంగా హిందీ లో ఈ సినిమా మొదటి రోజు కేవలం రూ. 65 లక్షలు సాధించగా.. రెండో రోజు వసూళ్లు మరింత పడిపోయాయి.

Alos Read : Karthik Dandu: పెళ్లి పీటలు ఎక్కబోతున్న స్టార్ డైరెక్టర్.. ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్

భారీ బడ్జెట్ తో తీసినప్పటికి.. బలమైన కంటెంట్ లేకపోతే విజయం సాదించడం కష్టమని ఈ సినిమా ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి. గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో కమల్ హాసన్, సిలంబరసన్, త్రిష కృష్ణన్, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, నాజర్ వంటి స్టార్ కాస్ట్ నటించారు. కానీ ఏ మాత్రం లాభం లేకుండా పోయింది. ఈ మూవీపై కమల్ చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ..ఆశలని అడియాశలయ్యాయి. ఇక పోతే థియేటర్స్ లో విడుదలకి ముందు మేకర్స్ ఈ సినిమాని ఎనిమిది వారాల తర్వాత మాత్రమే ఓటీటీలో విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు వారి అభిప్రాయాలు మారినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా. మేకర్స్ వారితో ప్రస్తుతం చర్చల్లో ఉన్నట్టు టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి.

Exit mobile version