Site icon NTV Telugu

Kamal Haasan : నేను ద్రోణాచార్యుడిని కాదు, ఇంకా విద్యార్థినే

Kamal Haasan Speech At Thug

Kamal Haasan Speech At Thug

ఈ సంవత్సరం భారత సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘థగ్ లైఫ్’ ఒకటి. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా, ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న ఈ హై-వోల్టేజ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5, 2025న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి నేతృత్వంలోని శ్రేష్ఠ్ మూవీస్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేయనుంది. గతంలో ‘విక్రమ్’, ‘అమరన్’ లాంటి బ్లాక్‌బస్టర్‌లను అందించిన ఈ సంస్థ, ఇప్పుడు ‘థగ్ లైఫ్’ను భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా మీట్‌లో కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read: Suhasini: నాయకన్ సినిమా చూసి మణిరత్నం గొంతు కోశా : సుహాసిని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మీడియా మీట్‌లో కమల్ హాసన్ మాట్లాడుతూ, “అందరికీ నమస్కారం. మణిరత్నం గారు ‘నాయకన్’ సినిమాతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన విధంగానే, ‘థగ్ లైఫ్’తో మరోసారి అందరినీ సర్‌ప్రైజ్ చేయనున్నారు. నన్ను కొందరు ద్రోణాచార్యుడితో పోల్చారు, కానీ నేను ద్రోణాచార్యుడిని కాదు, ఇంకా విద్యార్థినే. నేర్పించాలంటే ముందు నేర్చుకోవాలి. నేను ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను. మీరు కూడా నాతో కలిసి నేర్చుకోండి. మణిరత్నం సినిమాల్లో నేను నటించను, కేవలం పాత్రలో జీవిస్తాను. మేమంతా సినిమా అభిమానులం, సినిమాను ఎప్పుడూ గుండెల్లో దాచుకుంటాం. నాజర్ గారు ఆల్‌రౌండర్, ఆయనతో ఎన్నో సినిమాల్లో కలిసి పనిచేశాను. ‘ఇంద్రుడు చంద్రుడు’ సినిమాకు తనికెళ్ళ భరణి గారు డైలాగ్స్ రాయాల్సి ఉండగా, అది కుదరలేదు. ఆయనతో మరిన్ని ప్రాజెక్ట్‌లలో కలిసి పనిచేయాలని ఉంది.

Also Read: Spirit: ‘స్పిరిట్’ దీపికా పదుకొణె అవుట్.. రుక్మిణి వసంత్ ఎంట్రీ!

శింబు చిన్నతనం నుంచి నా సినిమాలు చూస్తూ పెరిగాడు. నేను కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించాను, అందుకే మాకు మంచి కనెక్షన్ ఏర్పడింది. సినిమానే మాకు అన్నీ నేర్పించింది. అందుకే నేను ఎప్పుడూ సినిమా విద్యార్థినే. నేను మనస్పూర్తిగా చేసిన ప్రతి సినిమా గొప్ప విజయం సాధించింది. ‘థగ్ లైఫ్’ కూడా అలాంటి సినిమానే. అభిరామి ఈ చిత్రంలో మళ్లీ నటించడం సంతోషంగా ఉంది. అద్భుతమైన టీమ్‌తో రూపొందిన ఈ సినిమా ఒక గొప్ప సెలబ్రేషన్. ఇలాంటి సినిమా మళ్లీ రాదు. ‘నాయకన్’ కంటే పెద్ద విజయం సాధిస్తుందని నేను హామీ ఇస్తున్నాను. తెలుగు సినిమా నాకు స్వస్థానం లాంటిది. తెలుగు ప్రేక్షకులు నన్ను స్టార్‌గా మలిచారు. వారికి నా కృతజ్ఞతలు. ఈ సినిమా జూన్ 5న విడుదలవుతోంది. ఎంతో ప్రేమతో రూపొందిన ఈ చిత్రాన్ని చూసి, మరింత గొప్పగా సెలబ్రేట్ చేద్దాం” అని అన్నారు.

Exit mobile version