NTV Telugu Site icon

GV Prakash : ఒకే సారి మూడు సినిమాలు.. హిట్ దక్కేనా..?

Gv Prakash

Gv Prakash

సంక్రాంతి తర్వాత మళ్లీ థియేటర్లు కళకళలాడే సీజన్ సమ్మర్. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోవడంతో స్టూడెంట్స్, పేరెంట్స్ స్ట్రెస్ రిలీఫ్ కోసం ఎంటర్టైన్మెంట్ ని ఆశ్రయిస్తుంటారు. అలా ఈ ఏడాది కూడా సమ్మర్ సీజన్ సద్వినియోగం చేసుకునేందుకు ప్రిపేరవుతున్నాయి సౌత్ ఇండియా సినిమాలు. మార్చి ఎండింగ్ నుండి థియేటర్లపై దండయాత్ర చేయబోతున్నాయి రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్, వీర ధీర శూరన్, లూసిఫర్ 2, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలు. కామన్‌గా హీరో హీరోయిన్లు, ఫిల్మ్ మేకర్లకు టెన్షన్ పట్టుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్‌కు మాత్రం టెస్టింగ్ టైంగా మారింది. ఎందుకంటే ఆయన మ్యూజిక్ అందించిన త్రీ మూవీస్ 15 రోజుల గ్యాప్ లో రిలీజ్ కాబోతున్నాయి.

Also Read : Raid 2 : రిస్క్‌ చేస్తున్న అజయ్ దేవగన్.. తేడా వస్తే అంతే

ఈ ఏడాది జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందించిన ఏ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సౌండ్ వినలేదు. వనంగాన్, నిలవుక్కు ఎన్మేల్ ఎన్నాడీ కోబం, నటించి కంపోజ్ చేసుకున్న కింగ్ స్టన్, బాలీవుడ్ ప్రాజెక్ట్ ఎమర్జెనీకి పాటలు ఇవ్వగా అది కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ యాజ్ ఎ కంపోజర్‌, జీవీ ప్రకాష్ కు క్రూషియల్‌గా మారాయి. రాబిన్ హుడ్, తమిళంలో వీర ధీర శూరన్ 2, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలు విడుదలకు ప్రిపేరయ్యాయి. వీర ధీర శూరన్, రాబిన్ హుడ్ మార్చి 27, 28 తేదీల్లో రిలీజ్ అవుతుండగా గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రాబోతుంది.

Also Read : Kalyabni Priyadarshan : టాలీవుడ్‌కు ‘టాటా’ చెప్పేసిన ‘హాలో’ బ్యూటీ

సినిమాను నిలబెడ్డటంలో, పడగొట్టడంలో కంటెంట్‌తో పాటు సంగీతం కూడా కొంత వాటా షేర్ చేసుకుంటుంది. కంగువా లాంటి భారీ బడ్జెట్ చిత్రానికి కంటెంటే కాదు.. దేవీ శ్రీప్రసాద్ ఇచ్చిన బీజీఎంపై విమర్శొలొచ్చాయి. రీసెంట్లీ గేమ్ ఛేంజర్ విషయంలో కూడా తమన్ నెగిటివిటీని మూటగట్టుకున్నాడు. ఇప్పుడు జీవీ ప్రకాష్.. బిగ్ స్టార్స్ విక్రమ్ వీర ధీర శూరన్ , అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఎక్కడైనా తేడా కొట్టిందంటే.. జీవీ ప్రకాష్ ఈ ఇద్దరి ఫ్యాన్స్ చేతిలో రోస్టింగ్‌కు రెడీ కావాల్సిందే. ఇప్పటికే కంపోజర్‌గా వంద సినిమాల మైల్ స్టో‌ కు చేరువైన జీవీ ప్రకాష్.. టెస్టులో పాసై అప్లాజ్ తెచ్చుకుంటాడో.. లేకా రోస్టింగ్‌కు రెడీ అవుతాడో వెయిట్ అండ్ సీ.