Toli Premakatha : ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులు.. ఇప్పుడు రొమాంటిక్ లవర్స్

Tpk

Tpk

బాలనటులుగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత హీరో హీరోయిన్లుగా మారి వెండితెరపై మ్యాజిక్ చేయడం టాలీవుడ్‌కు కొత్తేమీ కాదు. సరిగ్గా ఇప్పుడు అదే కోవలో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులు సాత్విక్ వర్మ, అనీ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సాయి లక్ష్మణ్ అల్లు దర్శకత్వంలో తెరకెక్కిన స్వచ్ఛమైన ప్రేమకావ్యం ‘తొలి ప్రేమ కథ’. లిఖిత్, ఆదిత్య సమర్పణలో లతా కె నిర్మించిన ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలై యూత్‌ను ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ‘హిట్’ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాపై చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారాయి.

ఈ టీజర్ చూసిన వెంటనే శైలేష్ కొలను చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. “ప్రస్తుతం ఆడియన్స్ ఒక జెన్యూన్, నేచురల్ లవ్ స్టోరీ కోసం ఎదురుచూస్తున్నారు. ‘తొలి ప్రేమ కథ’ కరెక్ట్ టైమ్‌లో వస్తున్న ‘మూడ్ ఆఫ్ ది సీజన్’ మూవీ. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి ఈరోజు హీరోగా మారడానికి సాత్విక్ ఎంత కష్టపడ్డాడో ఈ టీజర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎమోషన్స్, పర్ఫార్మెన్స్ ఎంతో సహజంగా ఉండటంతో పాటు ఆర్.ఆర్. ధ్రువన్ అందించిన మెలోడీ మ్యూజిక్, డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. కచ్చితంగా ఇది ప్రతి ఒక్కరూ థియేటర్లలో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన సినిమా” అంటూ ఆయన సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు.

మరో అతిథి, యంగ్ హీరో ఆకాష్ పూరి సైతం ఈ చిత్ర విజువల్స్ పట్ల అట్రాక్ట్ అయ్యారు. సాత్విక్, అనీ ఇద్దరూ తనకు చిన్నప్పటి నుంచే తెలుసని, వాళ్లిద్దరూ అద్భుతమైన పెర్ఫార్మర్స్ అని కితాబిచ్చారు. టీజర్ చాలా బ్యూటిఫుల్‌గా ఉందని, సినిమా కచ్చితంగా థియేటర్లలో పెద్ద సక్సెస్ సాధించాలని ఆయన ఆకాంక్షించారు. హీరో సాత్విక్ వర్మ మాట్లాడుతూ.. తనను ఎంకరేజ్ చేయడానికి వచ్చిన శైలేష్ కొలను, ఆకాష్ పూరిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ధ్రువన్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రాణం పోసిందని, దర్శక నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.