కేసరి చాప్టర్ 2 సినిమాలో కోలీవుడ్ స్టార్ ఆర్ మాధవన్ ముఖ్యమైన ప్రతినాయకుడి పాత్రలో మెప్పించాడు. 2025 ఏప్రిల్ 18న రిలీజ్ అయిన ఈ సినిమాలో అడ్వకేట్ నెవిల్ మెకిన్లీగా, బ్రిటిష్ ప్రభుత్వం తరపున వాదించే లాయర్ పాత్రలో కనిపించాడు. అక్షయ్ కుమార్ పోషించిన C. శంకరన్ నాయర్‌కు అపోజిట్ గా వాదించే కోర్ట్‌రూమ్ క్లాష్ సినిమాకే హైలైట్. నెగెటివ్ రోల్ కావడంతో ప్రేక్షకులు తనను ద్వేషించేలా నటించాడు మాధవన్.
Also Read : TheRajaSaab : నిధి అగర్వాల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఫ్యాన్స్.. వీడియో వైరల్
తర్వాత ఆప్ జైసా కోయీ లో మాధవన్ శ్రీరేణు త్రిపాఠి పాత్రలో కనిపిస్తాడు. జంషెడ్‌పూర్‌కు చెందిన 42 ఏళ్ల సంస్కృత ప్రొఫెసర్‌గా, పెళ్లికి దూరంగా ప్రశాంతంగా జీవించే వ్యక్తి. అతని జీవితంలోకి ఫ్రెంచ్ టీచర్ మధు పాత్రలో ఫాతిమా సనా షేక్ రావడంతో కథ భావోద్వేగంగా మలుపు తిరుగుతుంది. 2025 జూలై 11న ఓటిటిలో విడుదలైన ఈ సినిమాలో మాధవన్ నాచురల్ నటనతో మెప్పించాడు. దేదే ప్యార్ దే 2 లో మాధవన్ ఫుల్ కామెడీ మోడ్‌లో ఎంటర్‌టైన్ చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ తండ్రిగా దేవ్ ఖురానా పాత్రలో కనిపించాడు. ఇక్కడే ట్విస్ట్ రకుల్‌ను ప్రేమించే అజయ్ దేవగన్ వయసులో మాధవన్ కన్నా పెద్దవాడైనా, ఆయనకు సినిమాలో మాధవన్ ఫ్యూచర్ మామ. ఈ రివర్స్ ఏజ్ గ్యాప్ నుంచే హ్యూమర్ సీన్స్ బాగా పండాయి. ఇక లేటెస్ట్ మూవీ ధురంధర్ లో మాధవన్ పాత్ర సినిమాకే హైలైట్. భారతదేశపు టాప్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ జీవితం నుంచి ప్రేరణ పొందిన ఈ క్యారెక్టర్, అజిత్ దోవల్ డార్క్ లుక్, ఇంటెన్స్ యాక్టింగ్‌తో దేశభక్తి, ఉగ్రవాద వ్యతిరేక భావనలను మాధవన్ బలంగా ప్రెజెంట్ చేశాడని రివ్యూలు చెబుతున్నాయి.ఇలా బాలీవుడ్‌లో హీరో, లవర్, ఫాదర్, ప్రతినాయకుడు అన్నీ చేసి చూపించిన నటుడు గా 2025 ఏడాది మాధవన్ కెరీర్‌లో స్పెషల్ ఇయర్‌గా మారింది.
