NTV Telugu Site icon

NTRNeel: తారక్ – ప్రశాంత్ నీల్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

Untitled Design 2024 08 09t132019.686

Untitled Design 2024 08 09t132019.686

‘RRR’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీయార్ రాబోయే సినిమాలు వీరే లెవల్ లో ఉండేలా ఉన్నాయి ఆయన చేస్తున్న సినిమాలు చూస్తుంటే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ లో నటిస్తున్నాడు తారక్. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాలో తారక్ ద్విపాత్రాభినయం లో కనిపించనున్నాడు. పవర్ ఫుల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. దింతో పాటుగా వార్ 2 లోను నటిస్తున్నాడు తారక్. ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో తలపడనున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా భాషలలో తెరకెక్కిస్తున్నారు మేకర్స్.

Also Read: Rana : రానా – తేజ సినిమాకు ఏమైంది..?

వీటితో పాటు మరో సినిమాను స్టార్ట్ చేసాడు యంగ్ టైగర్. కేజీఎఫ్ సిరీస్ తో వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నాడు. నేడు ఈ సినిమా రామ నాయుడు స్టూడియో అతి కొద్ది మంది సమక్షంలో పూజ కార్యక్రమాలు నిర్వహించారు. దానితో పాటు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది నిర్మాణ సంస్థ. సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్టు అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ఏడాది సెప్టెంబరు 27న దేవర విడుదల కానుంది. 2025లో తారక్ నటించిన వార్ -2 రానుంది. 2026 ప్రశాంత్ నీల్ సినిమా. ఎన్టీఆర్,నీల్ సినిమాను మైత్రీ మూవీస్, ఎన్టీయార్ ఆర్ట్స్ పై కళ్యాణ్ రామ్, నవీన్, రవి శంకర్ నిర్మిచబోతున్నారు.

Show comments