రేపు థియేటర్లలో రెండు రీమేక్ చిత్రాల ఢీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూలై 30. ఈ యేడాదిలో చాలా కీలకమైన రోజు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు తెరచుకోబోతున్న రోజు. నిజానికి ఇటు తెలంగాణ, అటు ఆంధ్రాలో థియేటర్లు తెరవమని స్థానిక ప్రభుత్వాలు ఆదేశించినా… థియేటర్ల యాజమాన్యం మీనమేషాలు లెక్కిస్తూ కాలయాపన చేసింది. చివరకు జూలై 30న వీలైనన్ని థియేటర్లను తెరవాలని ఎగ్జిబిటర్స్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో నూరుశాతం ఆక్యుపెన్సీ ఉన్నా జంట థియేటర్లలో ఒకటి, మల్టీప్లెక్స్ లలో ఒకటి,రెండు మాత్రమే తెరచుకోబోతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఇందుకు భిన్నమైన పరిస్థితి ఏమీ లేదు. పైగా అక్కడ యాభై శాతమే ఆక్యుపెన్సీ. ఇదిలా ఉంటే… థియేటర్లు తిరిగి తెరచుకుంటున్న నేపథ్యంలో పేరుకు ఐదు చిత్రాలు విడుదల కాబోతున్నా, ప్రధాన పోటీ మాత్రం రెండు సినిమాల మధ్యనే ఉంటుంది. అది సత్యదేవ్ ‘తిమ్మరుసు’, తేజ సజ్జా ‘ఇష్క్’.
Read Also : అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో “మల్లేశం” డైరెక్టర్ మూవీ
Also Read
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
‘జ్యోతిలక్ష్మీ’ మూవీతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ కు రీమేక్ సినిమాలే ఎక్కువ పేరు తెచ్చిపెట్టాయి. కరోనా కారణంగా థియేటర్లు మూత పడినప్పుడు అతను నటించిన ’47 డేస్, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య, గువ్వ గోరింక’ సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. అయితే అంతకు ముందు వచ్చిన ‘బ్లఫ్ మాస్టర్’ తో పాటు ‘ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య’ సత్యదేవ్ కు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇందులో ఒకటి తమిళ రీమేక్ కాగా, మరొకటి మలయాళ రీమేక్. కానీ చిత్రంగా ఇప్పుడు సత్యదేవ్ కన్నడ రీమేక్స్ పై దృష్టి పెట్టాడు. శుక్రవారం జనం ముందుకు వస్తున్న ‘తిమ్మరుసు’, 2019 జనవరిలో వచ్చిన కన్నడ సినిమా ‘బీర్బల్’కు రీమేక్. దీన్ని కన్నడ సినిమా ‘కిరిక్ పార్టీ’ని తెలుగులో ‘కిర్రాక్ పార్టీ’గా రీమేక్ చేసిన శరణ్ కొప్పిశెట్టి తెరకెక్కించాడు. విశేషం ఏమంటే… 2020లో వచ్చిన మరో కన్నడ సినిమా ‘లవ్ మాక్ టైల్’ తెలుగు రీమేక్ ‘గుర్తుందా శీతాకాలం’లోనూ సత్యదేవ్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్నాడు.
ఇక 30న విడుదల కాబోతున్న మరో రీమేక్ మూవీ ‘ఇష్క్’. 2019లో మలయాళంలో వచ్చిన ‘ఇష్క్’ మూవీని అదే పేరుతో తెలుగులో మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ రీమేక్ చేసింది. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన తేజ సజ్జా… లీడ్ రోల్ చేసిన ‘ఓ బేబీ’ సైతం కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ కావడం విశేషం. ఇదిలా ఉంటే… ఈ యేడాది ఫిబ్రవరిలో విడుదలైన ‘జాంబిరెడ్డి’ సక్సెస్ తో తేజ సజ్జా మంచి ఊపు మీదున్నాడు. మరి కోర్టు డ్రామా ‘తిమ్మరుసు’, రొమాంటిక్ థ్రిల్లర్ ‘ఇష్క్’లలో తెలుగు ప్రేక్షకులు దేనివైపు మొగ్గు చూపుతారో చూడాలి.
తాజావార్తలు
-
Shiva: జపాన్లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..