సినీ పరిశ్రమలో గ్లామర్ పేరుతో హీరోయిన్స్‌ను అసౌకర్యకర పరిస్థితుల్లోకి నెట్టిన సందర్భాలు కొన్నేళ్ల క్రితం చాలా కనిపించేవి. ఒకప్పుడు దర్శకులు, నిర్మాతలు కథలో భాగమని చెప్పి, హీరోయిన్‌లపై కొన్ని అనవసరమైన సన్నివేశాలను రికార్డ్ చేసేవారు. ఈ పద్ధతులు మహిళలపై ఒత్తిడి పెంచడం మాత్రమే కాదు, వారి గౌరవం తగ్గించే విధంగా ఉండేవి. తాజాగా హీరోయిన్ డైసీ షా తన గత అనుభవాలను బయటపెట్టడంతో ఈ విషయం మళ్లీ చర్చకు దారి తీసింది. ఆమె చెప్పిన విషయాలు ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్న మార్పులను, పాత రోజుల్లో హీరోయిన్స్ ఎదుర్కొన్న ఇబ్బందులను మన కళ్లముందు తీసుకువచ్చాయి.
Also Read : Avoid These People: మైండ్ పీస్ కావాలంటే వీరి నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి!
ఒకసారి సినిమాలో తన నాభి (బొడ్డు)పై పండ్లు, సలాడ్లు వేసి సీన్ తీశారట. ఆ సన్నివేశం చేయడం చాలా అసౌకర్యంగా అనిపించిందని ఆమె తెలిపారు. డైసీ షా మాట్లాడుతూ.. ‘కన్నడ సినిమాల్లో ఒకప్పుడు “నాభి అందాల ప్రదర్శన” అనే ట్రెండ్ ఉండేది. ఈ తరహా సన్నివేశాలు పూర్తిగా మేల్ ఫాంటసీని దృష్టిలో పెట్టుకొని రూపొందించేవారు, అందులో హీరోయిన్‌కి ఎలాంటి గౌరవం ఉండదు. వారికి నాభి అందాల పిచ్చి’ అని తెలిపింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. కొందరు నెటిజన్లు అటువంటి పాత పద్ధతులు తప్పుపట్టగా..మరికొందరు ఇప్పుడు పరిస్థితులు మారాయని, నేటి సినిమాల్లో హీరోయిన్ పాత్రకు గౌరవం, ప్రాముఖ్యత పెరిగిందని అంటున్నారు. ఇప్పుడు సినిమా కథల్లో గ్లామర్ కంటే టాలెంట్‌కు ప్రాధాన్యం ఎక్కువ అని కామెంట్స్ చేస్తున్నారు.