Site icon NTV Telugu

Mollywood Heroines : ఈ భామలకు పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన లేదట

Beautiful

Beautiful

30 ప్లస్ క్రాస్ చేసేయడంతో మాలీవుడ్ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ హడావుడిగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కానీ ఏజ్ దాటినా కొంత మంది కేరళ కుట్టీలు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే చేయట్లేదు. 30 ప్లస్ అయితే ఏంటీ పెళ్లి చేసుకోవాలని రూల్ ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. సింగిల్ లైఫ్ బెటర్ దెన్ మింగిల్ అంటున్నారు. 35 క్రాస్ చేసినా పార్వతి తిరువోతు పెళ్లి ఊసేత్తట్లేదు. ఇక వీరి జాబితాలోకి చేరిపోయింది మాలీవుడ్, టాలీవుడ్ బ్యూటీ నిత్యా మీనన్. జీవితంలో అసలు పెళ్లే చేసుకోనంటోంది మరో స్టార్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ. కొన్ని ఇన్సిడెంట్స్ ఆమెను ఇలా మార్చేశాయి.

Also Read : Varun Dhawan : స్టార్ హీరోయిన్లతో మిస్ బిహేవియర్‌పై వరుణ్ ధావన్ వివరణ

ఇక వీరి బాటలోనే నడుస్తోంది హనీ రోజ్. పెళ్లి చేసుకొని హనీమూన్‌కు వెళ్లాలన్న ఆలోచనే లేనట్లు కనిపిస్తోంది అమ్మడికి.  చేతిలో రాచెల్ తప్ప మరో ప్రాజెక్టు లేదు కానీ పెళ్లి అనే ఊసే లేదు. ఇక మరో మాలీవుడ్ సుందరి మాళవిక మోహనన్‌ది కూడా ఇదే దారి.  అమ్మడికి 30 ప్లస్ దాటుతున్న పెళ్లి ధ్యాసే లేదు. మాలీవుడ్, బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్, ఒకప్పటి బ్యూటీ హీరోయిన్ లిజీ కుమార్తె కళ్యాణీ ప్రియదర్శన్‌ కూడా సోలో లైఫే బెటర్ అంటోంది. ఆ మధ్య మోహన్ లాల్ తనయుడు ప్రణయ్‌తో డేటింగ్ అంటూ వార్తలు వచ్చాయి కానీ జస్ట్ ఫ్రెండిషిష్పే అన్నది టాక్.  ఇక నెక్ట్స్ ఇయర్ 30లోకి ఎంటర్ కాబోతుంది 2018 ఫేం తన్వి రామ్.  30 ప్లస్ తర్వాతే బిజీగా మారడం కెరీర్ పై కాన్సంట్రేషన్ చేయడంతో పెళ్లి, పిల్లలు అనే ఊసెత్తడం లేదు ఈ స్టార్ హీరోయిన్స్.

Exit mobile version