The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ‘ది ప్యారడైజ్’ మరికొన్ని గంటల్లో భారీ ఎత్తున రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే ఓవర్సీస్ కంటెంట్ ఇంకా వెళ్ళలేదు. చివరి నిమిషం వర్క్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దాంతో ప్రింట్ ఇంకా డెలివరీ కాలేదు. జెట్ స్పీడ్ లో వర్క్స్ ఫినిష్ చేసి కంటెంట్ లోడ్ చేసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. సినిమాకు సంబంధించిన మొదటి సగం తెలుగు కంటెంట్ లాక్ చేసి లోడ్ చేసి ఇచ్చేసారు. ఈ కంటెంట్‌ను రిలీజ్ కు ప్లాన్ చేసిన అన్ని ఎలక్ట్రానిక్ లొకేషన్లకు పంపించే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది.
అయితే సెకండాఫ్ ఇంకా పెండింగ్ ఉంది. ద్వితీయార్థం ఫైనల్ కంటెంట్ కరెక్షన్స్ జరుగుతున్నాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నిమిషం కూడా గ్యాప్ లేకుండా వర్క్ చేస్తున్నాడు. గత రాత్రి జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ కు కూడా శ్రీకాంత్ హాజరుకాకుండా సినిమాకు సంబందించిన వర్క్స్ చూసుకుంటున్నాడు. మరికొన్ని గంటల్లో సెకండాఫ్ కంటెంట్ ‘క్యూబ్ లో లోడ్ చేయనున్నారు. కంటెంట్ అందిన తర్వాత, మాస్టరింగ్ పూర్తి చేసి అప్లోడ్ చేయడానికి క్యూబ్‌కు సుమారు 4 నుండి 5 గంటల సమయం పడుతుంది. ఓవర్సీస్లోని అన్ని డిజిటల్/ఎలక్ట్రానిక్ థియేటర్ లొకేషన్లకు సాయంత్రం లోగా తెలుగు కంటెంట్ చేరుకుంటుంది. ఇక హార్డ్ డిస్క్‌ల ద్వారా కంటెంట్ ప్రదర్శించే లొకేషన్లకు ఈ రోజు రాత్రి లేదా బుధవారం ఉదయానికల్లా హార్డ్ డ్రైవ్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇతర భాషల (తమిళం, హిందీ, మలయాళం, కన్నడ) కంటెంట్ గురువారం రోజు వెళ్లే అవకాశం ఉంది. రిమైనింగ్ లాంగ్వేజెస్ షోస్ కొన్ని క్యాన్సిల్ అయ్యే అవకాశం లేకపోలేదు.
Also Read
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
- The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
తాజావార్తలు
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!