ఒక్కోసారి సినిమాలోని అసలు హీరో కంటే గెస్ట్ రోల్ లో కనిపించి వెళ్లే హీరోల ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. విక్రమ్ సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే చివర పది నిమిషాల ముందు రోలెక్స్ పాత్రలో వచ్చే వచ్చి సూర్య ఎంతటి సంచలనం చేసిందో చెప్పక్కర్లేదు. ఇక టాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో స్టార్ హీరోలు గెస్ట్ అప్పీరియన్స్ లో కనిపించి మెప్పించారు. వారిలో రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల రెండు సినిమాలకు తనవంతు పాత్ర పోషించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Also Read : Kantara Chapter1 : సినిమా బడ్జెట్ మొత్తం ఓటీటీ డీల్ తో రికవరీ చేసిన కాంతార
మంచు మోహన్ బాబు, విష్ణు కాంబోలో నటించి నిర్మించిన చిత్రం కన్నప్ప. భారీ బడ్జెట్ పై తెరక్కేక్కిన ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య పాత్రలో కనిపించి మెప్పించాడు. రెబల్ స్టార్ కనిపించినంత సేపు ఆడియెన్స్ కి విజువల్ ట్రేట్ అందించింది. ప్రభాస్ నటించడంతో ఫస్ట్ డే కన్నప్ప కు భారీ వసూళ్లు వచ్చాయని చెప్పడంలో రెండో మాట లేదు. ఇక నేడు రిలీజ్ అయిన మరొక పాన్ ఇండియా సినిమా మిరాయ్. తేజ సజ్జా, మంచు మనోజ్ నటించిన ఈ సినిమా నేడు భారీ ఎత్తున రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకు కూడా రెబల్ స్టార్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన యూనిట్ సినిమా రిలీజ్ కు కొన్ని గంటల ముందు సోషల్ మీడియాలో అఫీషియల్ గా ప్రకటించింది. దాంతో ఒక్కసారిగా మిరాయ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా అయింది. ఇలా రెబల్ స్టార్ ప్రభాస్ రెండు సినిమాలకు తన వంతు సాయం అందించి సినిమా క్రేజ్ పెంచడంలో కీలక పాత్ర పోషించాడు.
