NTV Telugu Site icon

Mr.Bachchan: గబ్బర్ సింగ్ నువ్వా ..నేనా..తెలియాలంటే చూడాల్సిందే..?

Untitled Design (12)

Untitled Design (12)

మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో వీరి కాంబోలో వచ్చిన మిరపకాయ్ సూపర్ హిట్ సాధించడంతో మిస్టర్ బచ్చన్ పై అటు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు హరీష్ శంకర్. ఇటీవల విడుదలైన సితార్ సాంగ్ నెట్టింట హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్ర టీజర్ అభిమానుల్లో బచ్చన్ పై అంచనాలు రెట్టింపు చేశాయనడంలో సందేహం లేదు.

ఇక ఈ సినిమాలో మాస్ రాజాకు ప్రతికథానాయకుడిగా విలక్షణ నటుడు జగపతి బాబు నటిస్తున్నారు. తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాలో జగపతి బాబు తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ చేస్తూ ఓ చిన్నపాటి వీడియో బైట్ రిలీజ్ చేసారు. ఆ వీడియో లో జగ్గూభాయ్ “రవితేజను బచ్చన్ అంటున్నావ్ మరి విలన్ గబ్బర్ సింగ్ కదా అది ఎవరు నువ్వా నేనా అని దర్శకుడు హరీష్ శంకర్ ను ప్రశ్నించగా సార్ నేను దర్శకుడిని మాత్రమే మిరే గబ్బర్ సింగ్ అంటూ బదులిచ్చి, జగ్గూభాయ్ కి ధన్యవాదాలు తెలిపారు దర్శకుడు. ప్రస్తుతం ఏ వీడియో సోషల్ మిడియాలో వైరల్ అవుతోంది.

మరోవైపు అభిమానులు బచ్చన్ ఎప్పుడు వస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో వింటేజ్ రవితేజను మరోసారి చూస్తారని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తుండగా, మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.

Also Read: Kalki : ప్రభాస్, అమితాబ్ కు లీగల్ నోటిసులు..అసలేమైందంటే..? 

 

Show comments