Site icon NTV Telugu

JanaNayagan : మరో మలుపు తిరిగిన విజయ్ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ కధ…

Jananayagan (2)

Jananayagan (2)

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయగన్ సెన్సార్ వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతుంది. కొద్దీ సేపటి క్రితం జననాయగన్ సినిమాకు సెన్సార్ సరిఫికేట్ ఇవ్వాలని  CBFCకి ఆదేశాలు జారీ చేసింది మద్రాస్ హై కోర్టు. దాంతో అన్ని లైన్స్ క్లియర్ అయ్యాయి ఇక రిలీజ్ డేట్ రావడమే తరువాయి అనుకున్న తరుణంలో జననాయగన్ మేకర్స్ కు మరొక అవాంతరం ఎదురైంది. మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీల్ కు అప్పీల్ కు వెళ్ళింది సెన్సార్ బోర్డు. ఈ అప్పీల్ పై ఈ రోజు  మధ్యాహ్నం 2:15 గంటలకి హైకోర్టు ధర్మాసనం విచారణ జరపనుంది.

Also Read : JanaNayagan : మద్రాస్ హైకోర్టులో విజయ్ దళపతి సినిమాకు బిగ్ రిలీఫ్.

అన్ని అడ్డంకులు తొలగి రిలీజ్ అవుతుందని అనుకున్న టైమ్ లో మరోసారి చిక్కుల్లో పడింది. ఈ రోజు మధ్యాహ్నం జరగబోయే విచారణలో తీర్పు ఎలా ఉండబోతుందని అటు విజయ్ ఫ్యాన్స్ లోను ఇటు ట్రేడ్ వర్గాలలోను ఉత్కంఠ నెలకొంది.  జననాయగన్ లా సెన్సార్ టీమ్ నుండి ఇబ్బందులు ఎదురుకొన్న మరొక తమిళ సినిమా శివకార్తికేయన్ నటించిన పరాశక్తి మొత్తానికి సెన్సర్ నుండి U/A సర్టిఫికెట్ పొందింది. రేపు వరల్డ్ వైడ్ గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో జననాయగన్ మధ్యాహ్నం కూడా రిలీజ్ అవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సెన్సార్ నుండి సర్టిఫికెట్ వస్తే ఈ నెల 14న జననాయగన్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

Exit mobile version