NTV Telugu Site icon

Kannappa : ‘కన్నప్ప’లో శివుడిగా నటించేందుకు నో చెప్పిన స్టార్ హీరో ఇతడే.!

Kannappa

Kannappa

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్ప. ఈ సినిమాలో విష్ణుతో పాటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అలాగే విష్ణు కుమార్తెల తో పాటు విష్ణు కుమారుడు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుండి కన్నప్పలో కీలకమైన శివుడు పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పాత్రను బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ పోషించారు. ఈ పోస్టర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాబట్టింది.

Also Read : Zombie Reddy : చేతులు మారిన జాంబి రెడ్డి సీక్వెల్

మంచు విష్ణు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ మొదట కన్నప్పలో శివుడి పాత్రను తిరస్కరించినట్లు తెలిపాడు. దాంతో ఆ పాత్ర కోసం ఓ తమిళ స్టార్ హీరోను సంప్రదించారట కానీ ఆయన కూడా అందుకు నో చెప్పేశారట.  తెలిసిన సమాచారం ప్రకారం ఆ నటుడు మరెవరో కాదు స్టార్ హీరో సూర్య అని తెలిసింది. అందుకు కారణం సూర్య అప్పటికే ‘కర్ణ’ అనే బాలీవుడ్ సినిమాకు సైన్ చేశాడట. ఆ నేపథ్యంలో కన్నప్ప లో నటించేనుదుకు సూర్య సున్నితంగా తిరస్కరించాడట. భారీ బడ్జెట్‌ పై రూపొందించబడుతున్నఈ సినిమాలో మలయాళ స్టార్ మోహన్ లాల్, తమిళ స్టార్ హీరో శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ తో పాటు సౌత్ అలాగే నార్త్ కు చెందిన నటీనటులు నటించారు. ఈ ఏడాది సమ్మర్ ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించారు.