Anil Ravipudi : నేటి నుండి వెంకీ – కళ్యాణ్ రామ్ – అనిల్ ఆట షురూ

Anil Ravipudi

Anil Ravipudi

టాలీవుడ్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి.. గత కొన్నాళ్లుగా ప్రతి సంక్రాంతికి ఓ సినిమా రిలీజ్ చేసేలా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. గతేడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’, ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్‌ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో ఇండస్ట్రీ హిట్స్ కొట్టాడు అనిల్. ఇక ఇప్పుడు వెంకటేష్‌, కళ్యాణ్ రామ్‌లతో క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నాడు.

ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అనిల్ రావిపూడి, ఈ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్లాన్ చేశారు. ఇటీవలె లాంఛనంగా మొదలైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఒక సాంగ్‌తో పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. తాజా సమాచారం ప్రకారం  కొత్త షెడ్యూల్ జులై 2 నుండి అనగా ఈ రోజు నుండి ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో విక్టరీ వెంకటేష్ సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమాను ఎలాంటి బ్రేక్స్ లేకుండా నాన్‌స్టాప్‌గా షూట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. వచ్చే అక్టోబర్ నవంబర్ వరకు టోటల్ షూటింగ్‌ను పూర్తి చేయాలనేది ప్లాన్. అదే జోష్‌తో ఇప్పుడు షూటింగ్ చేస్తున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా.. కళ్యాణ్ రామ్ జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. ఈ క్రేజీ జోడీలతో వెండితెరపై అనిల్ చేసే మ్యాజిక్ మామూలుగా ఉండదని ఇన్‌సైడ్ టాక్. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నఈ సినిమా.. మ్యూజికల్ పరంగాను అదిరిపోతుందని అంటున్నారు. మరి అనిల్ రావిపూడి ఈసారి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.