Site icon NTV Telugu

Niharika : కమిటీ కుర్రోళ్ళు ట్రైలర్ అప్ డేట్ వచ్చేసింది..ఎప్పుడంటే ..?

Untitled Design (30)

Untitled Design (30)

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1 వస్తున్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. అంతా కొత్త వాళ్లతో రానుంది ఈ చిత్రం.యదు వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం కానున్నాడు. కాగా ఈ ఈచిత్ర టైటిల్ పోస్టర్ ను యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ రిలీజ్ ఇటీవల విడుదల చేయగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తప్పకుండా ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందని సాయి ధరమ్ తేజ్ ఆశాభావం వ్యక్తం చేస్తూ టీమ్ కు విషెష్ తెలిపారు.  ఈ చిత్రంతో 11 మంది నూతన హీరోలు, 4 హీరోయిన్స్‌ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 9న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కు రెడీగా ఉంది.

రిలీజ్ కు మరి కొద్దీ రోజులు మాత్రమే ఉండడంతో చిత్రానికి సంబంధిచి ప్రమోషన్స్ లో వేగం పెంచింది కమిటీ కుర్రోళ్ళు యూనిట్. అందులో భాగంగా ఈ చిత్ర ట్రైలర్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ నెల 26న మధ్యాహ్నం 12:30 గంటలకు ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్టు నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ఖాతలో పోస్టర్ రిలీజ్ చేసింది. అందరు నూతన నటీనటులతో యదార్ధ సంఘటనల ప్రేరణతో రూపొందిన ఈ చిత్రం చిన్న సినిమాలలో పెద్ద విజయం సాధించిన చిత్రాల సరసన నిలుస్తుందని టైటిల్ లాంఛ్ కార్యక్రమంలో నిర్మాత నిహారిక కొణిదెల వ్యాఖ్యానించారు. అతి త్వరలో రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

 

Also Read: OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న కింగ్ ఆఫ్ ది ప్లానెట్ ది ఎప్స్..ఎక్కడో తెలుసా ..?

Exit mobile version