NTV Telugu Site icon

The Raja Saab: గళ్ళ కోటు.. నల్ల ఫ్యాంటు.. టీ షర్ట్..బాబు లుక్ అదిరిందంతే!

Rajasaab

Rajasaab

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే పుట్టినరోజు వేడుకలు మొదలైపోయాయి. జపాన్ లోని టోక్యోలో రాధే శ్యామ్ సినిమా చూస్తూ అక్కడి అభిమానులు ఎంజాయ్ చేస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి ప్రభాస్ పుట్టిన రోజు ఎల్లుండి అంటే అక్టోబర్ 23వ తేదీన. కానీ అంతకు ముందుగానే పుట్టినరోజు సెలబ్రేషన్స్ తీసుకొచ్చేందుకు రాజా సాబ్ టీం సిద్ధమైంది. మారుతీ దర్శకత్వంలో విశ్వప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

Salman Khan: సల్మాన్ ఖాన్ కృష్ణ జింక కేసులో మాజీ ప్రేయసి సంచలన వ్యాఖ్యలు

హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ముందుగా సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలనుకున్నారు కానీ సంక్రాంతికి రిలీజ్ అవుతుందో లేదో చెప్పలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 4 2025న రిలీజ్ చేస్తున్నట్టు తాజా పోస్టర్ తో క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
పుట్టినరోజున ఆయన వస్తున్నాడని కూడా పేర్కొనడంతో టీజర్ లాంటిది ఏదైనా ప్లాన్ చేసి ఉండొచ్చని కూడా అంటున్నారు. ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆ పోస్టర్లో ప్రభాస్ గళ్ళ కోటు, నల్ల ప్యాంటు, టీ షర్టు ధరించి భలే మెరిసిపోతూ కనిపిస్తున్నారు. నిజానికి మొదటిసారి సంక్రాంతి సందర్భంగా ఒక పోస్ట్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో కూడా ప్రభాస్ చాలా అందంగా కనిపిస్తూ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చేశారు. ఇప్పుడు మరోసారి పుట్టినరోజు ముందు ట్రీట్ ఇచ్చేసారని చెప్పొచ్చు.

Show comments