రాకింగ్ స్టార్ గా ప్రసిద్ది చెందిన కన్నడ సూపర్ స్టార్ యష్, అతని భార్య, నటి రాధిక పండిట్ తో కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. జూలై 1న సాయంత్రం ఈ గృహప్రవేశం జరిగినట్టు తెలుస్తోంది. బెంగుళూరులో యష్ దంపతులు నిర్మించుకున్న కొత్త ఇంట్లో సాంప్రదాయ పూజలు నిర్వహించారు. వీరి గృహ ప్రవేశానికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. యష్ బెంగళూరులోని ప్రెస్టీజ్ గోల్ఫ్ అపార్ట్‌మెంట్‌లో ఇంటిని కొన్నాడు.
Read Also : స్టన్నింగ్ లుక్స్ తో కట్టిపడేస్తున్న కియారా
కాగా ప్రస్తుతం యష్ నటించిన “కేజీఎఫ్-2” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అన్ని చిత్రాల్లాగే కరోనా కారణంగానే ఈ సినిమా విడుదల తేదీ కూడా వాయిదా పడింది. అయితే మరోవైపు ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 9న విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. కానీ ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ లో పలువురు దిగ్గజ నటీనటులు కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా… సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
