The Paradise: నేచురల్ స్టార్ నాని తాజా పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌కి రెడీ అవుతున్న తరుణంలో టాలీవుడ్‌లో సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపునకు మేకర్స్ ప్రయత్నాలు ముమ్మరం చేయగా, నైజాం ఏరియాలో ఈ పెంపునకు లైన్ క్లియర్ అయినట్లు ఫిలింనగర్ వర్గాల్లో బలమైన టాక్ వినిపిస్తోంది. సాధారణంగా పెద్ద సినిమాలకు టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వాలతో చర్చలు జరపడం సర్వసాధారణం. అందులో భాగంగానే ఈ చిత్రానికి టికెట్ ధరలు పెంచాలనే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సైబర్ క్రైమ్ అవగాహన ప్రచారానికి మద్దతుగా, ప్రజల్లో చైతన్యం తెచ్చేలా నాని స్వయంగా ఓ ప్రత్యేక వీడియోను రూపొందించి విడుదల చేశారు. ప్రజా ప్రయోజనార్థం ప్రభుత్వానికి మద్దతుగా నాని ఈ వినూత్న అడుగు వేయడంతో, సినిమా టికెట్ ధరల పెంపు ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధికారిక ఉత్తర్వులు (జీవో) వెలువడటమే తరువాయి అని సమాచారం. ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని సరసన యంగ్ బ్యూటీ కయాదు లోహర్ కథానాయికగా నటిస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే పాటలు, ప్రచార చిత్రాలతో భారీ హైప్ క్రియేట్ కాగా, ఇప్పుడు నైజాం వంటి కీలక ఏరియాలో టికెట్ ధరల పెంపు ఖాయం కావడంతో ఓపెనింగ్ డే కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డ్ సృష్టిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Say NO to drugs.
Say YES to life. ❤️If you have information about drug-related activities or those involved in the drug trade, call the Eagle Force at 1908.
Together, let’s build a Drug-Free Telangana. @EAGLE_TELANGANA pic.twitter.com/z2UPHNWkmM
— THE PARADISE (@TheParadiseOffl) September 19, 2026

