Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonali Kulkarni: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నానికి తల్లిగా, ‘సమ్మక్క’ అనే అత్యంత కీలకమైన పాత్రలో నటించిన ప్రముఖ బాలీవుడ్ నటి సోనాలీ కులకర్ణి స్టేజీపైనే భావోద్వేగానికి లోనయ్యారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి ఆమె కళ్లలో ఆనందభాష్పాలు సుడులు తిరిగాయి. ఈ సందర్భంగా ఆమె వేదికపై మాట్లాడుతూ.. “సినిమా ఇంకా రిలీజ్ కాకముందే ఇంతటి ప్రేమాభిమానాలు దక్కడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను చాలా ఎమోషనల్ అయిపోతున్నాను. ఈ సినిమాలో నేను ‘సమ్మక్క’గా కనిపిస్తాను. డైరెక్టర్ శ్రీకాంత్, సాయి, వినయ్ ఈ రోజు ఇక్కడుండి వాళ్ల కష్టానికి దక్కుతున్న ఈ ప్రేమని చూడాల్సింది. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ మొత్తం రక్తం, చెమటోడ్చింది. షూటింగ్ సమయంలో అంతా ఎన్నో తీవ్రమైన ఎమోషన్స్‌ను అనుభవించారు. కానీ ఆ సమయంలో మాలో ఉన్న జోష్, ఎనర్జీ వేరే లెవల్” అంటూ షూటింగ్ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు.
నానిపై ప్రశంసల వర్షం కురిపిస్తూ సోనాలీ చేసిన కామెంట్స్ ఈవెంట్లో హైలైట్‌గా నిలిచాయి. “నేను నా కెరీర్లో ఎన్నో భాషల్లో, వందల చిత్రాల్లో నటించాను. కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో నాని సృష్టించిన ఈ సామ్రాజ్యం, ఆయనపై ప్రేక్షకులు కురిపిస్తున్న ఈ వెర్రి ప్రేమని నేనెక్కడా చూడలేదు. ఇది నిజంగా అన్బిలీవబుల్ క్రేజ్.. సెప్టెంబర్ 24న థియేటర్లలో సరికొత్త చరిత్ర మొదలుకానుంది. ఒకవైపు డైరెక్టర్ శ్రీకాంత్ తల్లి, మరోవైపు సినిమాలో నాని తల్లిగా నేను ఇక్కడ కూర్చున్నాం. మా ఈ ఉద్వేగభరిత కథకు ప్రేక్షకులు ఎలాంటి విజయాన్ని అందిస్తారో చూడాలి” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ ఆమెను ప్రశ్నిస్తూ.. “మీ జీవితంలో ప్యారడైజ్ అంటే ఎవరు?” అని అడగగా, ఏమాత్రం తడుముకోకుండా సోనాలీ ఇచ్చిన సమాధానం ఆడిటోరియాన్ని చప్పట్లతో హోరెత్తించింది. “ప్రస్తుతం నన్ను ఇంతలా ఆదరిస్తున్న ఈ తెలుగు ప్రేక్షకులే నా అసలైన ప్యారడైజ్” అంటూ ఆమె ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. నాని ‘ది ప్యారడైజ్’ కేవలం మాస్ యాక్షన్ మాత్రమే కాకుండా, తల్లి – కొడుకుల మధ్య బలమైన ఎమోషన్లతో గుండెల్ని హత్తుకోనుందని ఆమె ప్రసంగంతో స్పష్టమైంది. సెప్టెంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
- The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
- Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మండాడి’..
- Kartikeya Gummakonda : తన 'కమ్‌బ్యాక్' కోసం మెగాఫోన్ పట్టిన 'ఆర్ఎక్స్ 100' హీరో..
తాజావార్తలు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
-
The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
-
AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!