The Paradise: వాయిదా లేదు.. చెప్పిన డేటుకే నాని సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Paradise: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, ‘దసరా’ ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ (The Paradise). భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్ ఆలస్యం అవుతోందని, సినిమా చెప్పిన సమయానికి రాకపోవచ్చంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే, ఈ రూమర్లకు ఏకంగా వరుస అదిరిపోయే పోస్టర్లతో చిత్ర బృందం దిమ్మతిరిగే సమాధానమిచ్చింది. ఈ భారీ చిత్రం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్నట్లు మేకర్స్ తేల్చిచెప్పారు. ‘వాయిదా పడే ప్రసక్తే లేదు’ అనే సంకేతాన్ని ఇస్తూ విడుదల చేసిన ఈ కొత్త పోస్టర్లు ప్రస్తుతం ఇంటర్నెట్లో దుమ్మురేపుతున్నాయి.
ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇషాన్ సక్సేనా సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. పోస్టర్‌పై ప్రముఖంగా పేర్కొన్న ‘జడల్ జమానా షురూ’ (Jadal Zamaana Shuru) అనే హైలైట్. ఒక హీరో ఈ స్థాయి విచిత్రమైన, అత్యంత రా అండ్ రస్టిక్ రౌడీ లుక్‌లో కనిపించడం టాలీవుడ్లోనే తొలిసారి కావడంతో, ఇది నెట్టింట పెను సంచలనంగా మారింది. ఒక పోస్టర్లో వెనుక బ్లేడ్లు, గొలుసుల చక్రం మధ్య రెండు జడలతో గ్యాంగ్‌స్టర్‌లా కుర్చీలో పవర్ చూపిస్తుంటే.. మరో పోస్టర్లో శత్రువుల రక్తంతో తడిసిపోయిన దేహంతో ఆకాశం వైపు చూస్తూ విద్వంసకారుడిలా దర్శనమిచ్చారు. ఇంకో పోస్టర్లో వర్షంలో ఆయుధం భుజాన వేసుకుని బ్యాక్ పోజుతో మాస్ అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లగా, హీరోయిన్ను ఎత్తుకుని డ్యాన్స్ చేస్తున్న ఫుల్ జోష్ లుక్ కూడా సినిమాలోని వైవిధ్యాన్ని స్పష్టం చేస్తోంది. ‘దసరా’తో మాస్ ఊచకోత ఎలా ఉంటుందో రుచి చూపించిన శ్రీకాంత్ ఓదెల, ఈసారి నానిని అంతకుమించిన క్రూరమైన, డిఫరెంట్ ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారని స్పష్టమవుతోంది. దానికితోడు అనిరుధ్ మ్యూజిక్ బలం తోడవ్వడంతో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!