The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Paradise: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ ది ప్యారడైజ్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలను సృష్టిస్తుంది. థియేటర్లలోకి సినిమా రాకముందే టికెట్ బుకింగ్స్ పోటెత్తుతున్నాయి. తాజాగా అందుతున్న ట్రేడ్ సమాచారం ప్రకారం.. ప్రీమియర్ షోలు, డే-1 అడ్వాన్స్ సేల్స్‌తో కలిపి చెన్నైలో ఇప్పటికే రూ.కోటి గ్రాస్ మైలురాయిని సునాయాసంగా దాటేసింది. నాని కెరీర్లోనే అత్యధిక అడ్వాన్స్ సేల్ రికార్డ్ ఇది అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రధాన నగరాల్లోనూ ‘ది ప్యారడైజ్’ టికెట్ల కోసం అభిమానులు ఎగబడుతున్నారు. కేవలం ప్రీమియర్లు, మొదటి రోజు మార్నింగ్ షోల అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రూ.కోటి మార్కును దాటడం సినిమాపై ఆడియన్స్‌కి ఉన్న క్రేజ్‌కి నిదర్శనంగా నిలుస్తోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతన్నాయి. బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్లలో షోలు హాట్ కేకుల్లా అమ్ముడైపోతుండటంతో థియేటర్ల వద్ద ఫాస్ట్ ఫిల్లింగ్, హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
గతంలో వచ్చిన ‘దసరా’, ‘సరిపోదా శనివారం’ చిత్రాలతో మాస్ హీరోగా తన రేంజ్‌ను ఎన్నో రెట్లు పెంచుకున్న నాని, ఇప్పుడు ‘ది ప్యారడైజ్’తో సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు వచ్చిన అడ్వాన్స్ సేల్స్ ట్రెండ్‌ను పరిశీలిస్తే.. నాని కెరీర్లోనే ఇది ‘ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనర్’గా నిలవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓవర్సీస్ ప్రీ-సేల్స్‌లోనూ ఈ చిత్రం భారీ సంచలనం సృష్టిస్తుండగా, ఇండియన్ మార్కెట్లో గంటగంటకూ అడ్వాన్స్ కలెక్షన్ల గ్రాఫ్ అమాంతం పెరుగుతోంది. శ్రీకాంత్ ఓదెల సరికొత్త రా అండ్ రస్టిక్ మేకింగ్, నాని నెవర్ బిఫోర్ జడల్ లుక్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ఈ స్థాయి సునామీ కనిపిస్తుంటే.. ఇక మరికొద్ది గంటల్లో సినిమా థియేటర్లలోకి వచ్చాక బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు బద్దలవుతాయోనని సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
Also Read
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
- Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
- Paradise First Review: థియేటర్లు బ్లాస్ట్.. 'ది ప్యారడైజ్' లాస్ట్ 40 నిమిషాలు నాని ర్యాంపేజ్.. ఆ పాపులర్ హీరో సర్ ప్రైజ్ క్యామియో!
- Nani Wife : ఆరోజు మార్నింగ్ షో కూడా పడలేదు.. 16 ఏళ్ల కష్టానికి సాక్షిని నేనే.. నాని భార్య ఎమోషనల్
తాజావార్తలు
-
The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
-
Vivo S2 FE: 10,000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP68 + IP69 రేటింగ్.. వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్..
-
Chandigarh University: ఫ్రెషర్స్ వేడుకలో అసభ్యకర డ్యాన్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
Ram Charan: “మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న” చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
-
AP Inter Exams 2027: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. 2027 పరీక్షల ఫీజు చెల్లింపు నోటిఫికేషన్ విడుదల
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!