NTV Telugu Site icon

Dheeraj Mogilineni : చిన్న సినిమాలకు ఇక నుండి ఒకటే రూల్ ..అదేమంటే..?

Untitled Design (2)

Untitled Design (2)

టాలీవుడ్ లో చిన్న సినిమాల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఏవో పెద్ద బ్యానర్ సపోర్ట్ ఉంటె రిలీజ్ సమయంలో థియేటర్లు దొరుకుతాయి తప్ప, చిన్న నిర్మాతలకు థియేటర్లు దొరికే పరిస్థితి ఉండదు.మరో వైపు ఒక్కోసారి సినిమా బాగున్నా కూడా ప్రేక్షకులు థియేటర్లకు రాని పరిస్థితి. అందుకు కారణం లేకపోలేదు. చిన్న సినిమాలకు హిట్ టాక్ వచ్చి, మౌత్ టాక్ బాగుంటే తప్ప కలెక్షన్లు రావు. మల్టీప్లెక్స్ లో చిన్న సినిమాలకు టికెట్ ధర కూడా 175రూపాయలు ఉంటుంది. దీంతో ఫ్యామిలీతో సినిమా వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి.

కాగా ఈ నెల 19న ‘పేకమేడలు’ అనే చిన్న సినిమా ఒకటి విడుదల కాబోతోంది. బాహుబలిలో ముఖ్య పాత్ర పోషించిన రాకేష్ వర్రే ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని కొనుగోలు చేసారు. గత రాత్రి పేకమేడలు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేదికపై ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ ” ఈ మధ్య కాలంలో డిస్ట్రిబ్యూట్ చేసేందుకు చాలా సినిమాలు చూసాను, కానీ పేకమేడలు చాలా బాగా నచ్చి ఈ సినిమా రైట్స్ కొనుగోలు చేశాం. ఈ సినిమా అందరికి చేరేవిధంగా పైడ్ ప్రీమియర్స్  టికెట్ ధర -రూ .50 , శుక్రవారం రెగ్యులర్ షోస్  టికెట్ ధర రూ. 100 మాత్రమే ఉండేలా ఫిక్స్ చేసాం. చిన్న సినిమాలు బాగున్నపుడు అందరు థియేటర్ కు వచ్చి చూడాలంటే చిన్న నిర్మాతలు ఈ రూల్ పాటిస్తే వారి సినిమాలు ఎక్కువ మంది చూస్తారు” అని అన్నారు.

Also Read: wedding invitation: ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానము..అందరూ ఆహ్వానితులే