NTV Telugu Site icon

UnstoppableWithNBK : ‘సీమ సింహం’ తో సింగం ముచ్చట్లు

Ustnbk

Ustnbk

అన్‌స్టాపబుల్ టాక్‌షో సీజన్ – 4 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. మొదటి రెండు ఎపిసోడ్స్ కు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దుల్కర్ సల్మాన్ అన్‌స్టాపబుల్ స్టేజ్ పై సందడి చేసారు. ఆసక్తికర ప్రశ్నలతో, సరదా సంభాషణలతో ప్రేక్షకులను విశేషంగా అలరించాయి ఆ ఎపిసోడ్స్. ఇక మూడవ ఎపిసోడ్ గాను తమిళ స్టార్ హీరో సూర్య ఈ అన్‌స్టాపబుల్’ టాక్‌షో సీజన్ – 4 లో సందడి చేసారు. కంగువ ప్రమోషన్స్ లో భాగంగా సూర్య అన్‌స్టాపబుల్ సెట్లో సందడి చేశారు.

తాజగా అన్‌స్టాపబుల్ సీజన్ -2 ఎపిసోడ్ 3 కి సంబంధించి కంగువ యూనిట్ పాల్గొన్న ప్రోమో విడుదల చేసింది ఆహా. ఈ ఎపిసోడ్ లో సూర్యతో పాటుగా ఆయన నటించిన పాన్ ఇండియా సినిమా కంగువ దర్శకుడు శివ పాల్గొన్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు యానిమల్ విలన్ బోబి డియోల్ కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యాడు. సూర్య నటించిన గజినీ సినిమాలోని హృదయం ఎక్కడనున్నది సాంగ్ కు బాలయ్య,సూర్య స్టెప్పులేసి అలరించారు. సూర్య ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పాలని బాలయ్య ప్రశ్నించగా, సార్ వద్దు సార్ ఇప్పుడు ఆ పేరు చెప్తే గోడవలు అవుతాయ్ అని సూర్య బదులిచ్చాడు. అలాగే సూర్య సినీ జర్నీ విశేషాలతో పాటు సూర్య జ్యోతిక ప్రేమ విషయాలను కూడా బాలయ్యతో పంచుకునున్నాడు సూర్య. మధ్యలో సూర్య తమ్ముడు కార్తితో బాలయ్య సరదా ప్రశ్నలు ప్రమోకే హైలెట్ గా నిలిచాయి. ఈ శుక్రవారం స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ 3 ప్రోమోను చూసేయండి

Also Read : Thandel : అక్కినేని అభిమానులు ఆవేదన.. వినేదెవరు..?

Show comments