Site icon NTV Telugu

Ashika Ranganath : ఈ సంక్రాంతికీ లక్ పరీక్షించుకుంటున్న కన్నడ క్యూటీ

Ashika Ranganath

Ashika Ranganath

రష్మికలా టాలీవుడ్‌లో సెటిల్ అవుదామని ప్రయత్నిస్తున్న ఆషికా రంగనాథ్‌కు చుక్కెదురౌతోంది. స్టార్ హీరోలతో, స్టార్ బ్యానర్స్‌లో వర్క్ చేసినా హిట్ రావడం లేదు. నందమూరి కళ్యాణ్ రామ్ అమిగోస్‌తో టీటౌన్ ఎంట్రీ తీసుకున్న ఆషికా.. యాక్టింగ్, గ్లామర్ పరంగా స్టన్నింగ్ లుక్స్‌లో కట్టిపడేసింది. కానీ ఆ సినిమా ప్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత నా సామి రంగాలో అక్కినేని నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇందులో పల్లెటూరి అమ్మాయిగా కనిపించినా ఫలితం నిల్. 2024 సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభరలో కనిపించింది. ఎప్పుడో షూట్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది.

Also Read : VaaVaathiyaar : జనవరి 14న అన్నగారు వస్తున్నారహో…

టూ ఇయర్స్ గ్యాప్ తర్వాత మరో సంక్రాంతికి తన లక్ పరీక్షించుకోబోతోంది ఆషికా. భర్త మహాశయులకు విజ్ఞప్తితో రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. ఆమెతో పాటు డింపుల్ కూడా పోటీ కాబోతోంది. అందుకే ఈసారి కాస్త గ్లామర్ డోస్ పెంచింది బ్యూటీ. అసలే అటు శాండిల్ వుడ్, అటు కోలీవుడ్ సహా తెలుగులో కూడా నాలుగైదేళ్ల నుండి హిట్ లేని ఆషికా రంగనాథ్ సక్సెస్ అందుకోవడం చాలా నీడ్. భర్త మహాశయులకు విజ్ఞప్తి ఈ నెల 13న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతోనైనా ఈ పొంగల్‌కు బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకుంటుందా. టాలీవుడ్‌లో మరిన్ని ఆఫర్స్ కొల్లగొడుతుందో మరో రేడు రోజుల్లో తెలుస్తుంది.

Exit mobile version