Site icon NTV Telugu

Kannappa : ప్రమోషన్లలో కనిపించని హీరోయిన్.. కారణమేంటి.?

Prithi Mukundan

Prithi Mukundan

కన్నప్పపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు మంచు విష్ణు. ఈ సినిమా కోసం భారీగా ఖర్చుపెట్టాడు. షూటింగ్ స్టార్టైన దగ్గర నుండి ఎండింగ్ వరకు బాగా కష్టపడ్డాడు.  మరికొన్ని గంటల్లో భారీ ఎత్తున థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేరే లెవల్లో చేశాడు. ముంబయిలో టీజర్ లాంచ్ ఈవెంట్ దగ్గర నుండి హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు సక్సెస్‌ ఫుల్‌గా సాగిపోయింది. విష్ణు కలల ప్రాజెక్ట్ కన్నప్పను రెండేళ్ల క్రితం అఫీషియల్‌గా లాంచ్ చేశాడు. కానీ ఈ సినిమా హీరోయిన్ ప్రీతి ముకుందన్ ప్రమోషన్స్ కు ముఖం చాటేసింది.

Also Read : Cine Roundup : టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. సినీ రౌండప్

కన్నప్ప విష్ణుకే కాదు ప్రీతి ముకుందన్ కు మోస్ట్ ఇంపార్టెంట్ మూవీ.  ఇప్పటి వరకు ఆమె చేసిన టూ ఫిల్మ్స్ మంచి విజయాలను నమోదు చేశాయి.  కన్నప్ప చెన్నై సుందరికి  థర్డ్ మూవీయే కాదు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కూడా. ఈ సినిమా హిట్ పడితే హ్యాట్రిక్ బ్యూటీ, గోల్డెన్ లేడీ, లక్కీ గర్ల్ అన్న బిరుదులు వచ్చేస్తుంటాయి. అలాంటిది ప్రీతి ముకుందన్ ఎక్కడా ప్రమోషన్లతో పాటు ఎలాంటి ఇంటర్వ్యూల్లోనూ పాల్గొనలేదు. నార్తే కాదు సౌత్‌లో జరిగిన ఏ  ఈవెంట్లోనూ కనిపించలేదు. ఆమె నేమ్ కూడా పెద్దగా ప్రస్తావనకు వచ్చినా దాఖలాలు లేవు. కాజల్‌ది చిన్న రోల్ కాబట్టి లైట్ తీసుకుంది అనుకుంటే ప్రీతి ఎందుకు స్కిప్ చేసిందో క్లారిటీ రాలేదు. చివరకు స్మాల్ రోల్స్ చేసిన మమ్ముట్టి, అక్షయ్ కుమార్,  మధుబాల కూడా పలు ఈవెంట్లలో హాజరయ్యి సినిమాపై హైప్ తెచ్చారు. మరి షూటింగ్స్‌తో బిజీగా ఉండిపోయిందా లేదా ఏవైనా ఇష్యూస్ అనేది తెలియాల్సి ఉంది. ఏదైతేనేం కన్నప్ప మిరికొన్ని గంటల్లో వచ్చేస్తున్నాడు.
Exit mobile version