హిలేరియస్ కామెడీతో తక్కువ టైంలోనే తమిళ తంబీలకు దగ్గరయ్యాడు సంతానం. కమెడియన్‌గా కెరీర్ పీక్స్‌కు వెళ్లినప్పుడు హీరోగా మారాడు. మర్యాద రామన్న తమిళ వర్షన్‌తో భారీ సక్సెస్ కొట్టడంతో హీరోగా ప్రయత్నాలు స్పీడప్ చేశాడు. అలా అతడి కెరీర్‌కు టర్నింగ్ ఇచ్చిన మూవీ ధిల్లకు దుడ్డు. ఈ హారర్ కామెడీకి మంచి అప్లాజ్, కలెక్షన్స్ రావడంతో ఈ వెంచర్ నుండి వరుస చిత్రాలను తీసుకు వచ్చాడు. కెరీర్ కాస్త తడబడుతుంది అనుకున్నప్పుడల్లా ధిల్లుకు దుడ్డుకు సీక్వెల్స్ తెచ్చి డౌన్ అవుతున్న గ్రాఫ్ మళ్లీ పుష్ చేసుకుంటున్నాడు సంతానం. ఇప్పటి వరకుఈ ఫ్రాంచైజీ నుండి మూడు సినిమాలొచ్చాయి.
ధిల్లకు దుడ్డు, ధిల్లకు దుడ్డు 2, డీడీ రిటర్న్స్ మంచి వసూళ్లను తెచ్చిపెట్టడంతో పాటు కెరీర్‌కు బూస్ట్ అయ్యాయి. రీసెంట్లీ వరుస ప్లాపులతో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న సంతానం మరోసారి ఈ ఫ్రాంచైజీ మూవీనే నమ్ముకున్నాడు. హిట్ సిరీస్ లో భాగంగా డీడి 4ను తీసుకు వస్తున్నాడు. ఇప్పుడు మరింత కొత్తగా, వేరే లెవల్ హారర్ కామెడీని దింపుతున్నాడు. థిల్లుకు దుడ్డు ఫ్రాంచైజీలో భాగంగా డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవల్ వస్తుంది. రీసెంట్లీ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు కార్తీ, విశాల్, శింబు. సంతానంతో పాటు గౌతమ్ వాసు దేవ్ మీనన్, సెల్వరాఘవన్ కీ రోల్స్ చేస్తున్నారు. ఆర్య బ్యానర్ ది షో పీపుల్, నిహారిక ఎంటర్ టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మే 16న తమిళంతో పాటు తెలుగు, హిందీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ట్రైలర్ హిలేరియస్ పుట్టిస్తుంది మరీ ఈ హారర్ కామెడీ తమిళ్‌లో ఓకే తెలుగు ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్ చేస్తుందో మళ్లీ సంతానం హిట్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి