Site icon NTV Telugu

Major Success Meet: వాళ్లంతా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు

Mejor

Mejor

‘మేజర్‌’ ఈ చిత్రం ప్రేక్ష‌కుల్లో మంచి ఆద‌ర‌ణ పొందుతోంది. ఈ చిత్రానికి శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహించగా.. హీరోగా అడివి శేష్‌, సయీ మంజ్రేకర్‌, శోభిత ధూలిపాళ్ల నాయికలుగా నటించారు. తాజాగా హైదరాబాద్‌లో ‘మేజర్‌’ సక్సెస్‌మీట్‌ నిర్వహించారు. ‘మేజర్‌ సందీప్‌కు మేమిచ్చిన నివాళి ఈ సినిమా అంటూ అడివి శేష్‌ అన్నారు. ఇదొక ఆరంభం మాత్రమే. ఇలాంటి గొప్ప చిత్రాలను ఇంకా రూపొందించాలని అనుకుంటున్నాం. ఈ సినిమా చూసి సైన్యంలో చేరుతామనంటూ చాలా మంది చెప్పడం సంతోషంగా ఉంది. సైన్యంలోకి వెళ్లాలనుకుని, పేదరికంతో సరైన శిక్షణ లేని వాళ్లందరికీ మేము ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నాం. ఆ కార్యక్రమాన్ని కూడా మేజర్‌ సందీప్‌ పేరుమీదే చేస్తాం’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ…‘మేజర్‌ సందీప్‌ మా టీమ్‌ను నడిపించాడు. ఆయన ఒక సైనికుడిగా ఎంత గొప్పగా బతికాడో మా సినిమా ద్వారా చూపించడం గర్వంగా ఉంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ వీర సైనికుడికి నివాళి అర్పిస్తున్నారు’ అన్నారు.

ఇక అది అలా ఉంటే ఈ సినిమాను చూసిన అల్లు అర్జున్ మేజర్ టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఈ సినిమా గుండెకు హత్తుకుంది. మ్యాన్‌ ఆఫ్‌ ది షో అడివి శేష్‌ మరోసారి తన మ్యాజిక్‌ చేశారు. కథలో కీలక పాత్రల్లో నటించి ప్రకాష్ రాజ్‌, రేవతి, సయీ మంజ్రేకర్‌, శోభితా దూళిపాల చక్కని సపోర్ట్‌ ఇచ్చారు. దర్శకుడు శశి కిరణ్‌ తిక్కా తన ప్రతిభ చూపించారు. శ్రీచరణ్‌ పాకాల బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అదిరింది. ప్రేక్షకులకు ఇంత మంచి చిత్రాన్ని అందించిన నిర్మాత మహేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలంటూ అభినందించారు. దీనికి స్పందించిన హీరో అడివి శేష్.. థాంక్యూ.. మీ ప్రేమకు చాలా ధన్యవాదాలు అల్లు అర్జున్. క్షణం నుండి మేజర్ వరకు మీ సపోర్ట్ మరవలేనిది అంటూ బదులిచ్చారు.

ఇక ఈ సినిమాలో 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని చూపించారు. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్‌లో ఎమోషన్స్‌తో పాటు అదిరే యాక్షన్ సీక్వెన్సెస్‌ను పొందుపరిచారు. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా‌తో పాటు GMB ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్ పతాకాలపై సంయుక్తం నిర్మించారు. ‘మేజర్’ సినిమాను 120 పని దినాల్లో షూటింగ్ కంప్లీట్ చేసారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హోటల్ సెట్ సహా 8 సెట్లు వేసారు.

Exit mobile version