NTV Telugu Site icon

Sushant : మిస్టరీగానే మిగిలిపోయిన యంగ్ హీరో సూసైడ్

Sushant Singh Rajput

Sushant Singh Rajput

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్నాడు. వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ గా ఎదుగుతున్న క్రమంలో ముంబయిలోని బాంద్రాలో 2020 జూన్‌ 14న సుశాంత్‌ సింగ్‌ తన ఫ్లాట్‌లో అనుమానాస్పద రీతిలో మరణించారు. సుశాంత్ మృతి పట్ల పలు అనుమానాలు నెలకొన్నాయి. బాలీవుడ్ నటి రియా చక్రవర్తి వలన సుశాంత్ సూసైడ్ చేసుకున్నాడని కథనాలు వినిపించాయి.

Also Read : Keerthy Suresh : బాలీవుడ్ లో మరో సినిమాకు మహానటి గ్రీన్ సిగ్నల్

ఈ నేపధ్యంలో సుశాంత్‌ తండ్రి నటి రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసాడు. సుశాంత్ కేసును టేకప్ చేసిన సీబీఐ దాదాపు నాలుగేళ్లపాటు ఈ కేసును దర్యాప్తు చేసి నివేదికను సమర్పిచ్చింది. తుది దర్యాప్తులో సుశాంత్‌ ది హత్య కాదని, ఆత్మహత్య చేసుకున్నాడని అందుకు ఎవరైనా ప్రేరేపించారనేందుకు ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని పేర్కొంది. ఇప్పటి వరకు ఈ కేసులో అనుమానితురాలుగా పేర్కొన్న రియా చక్రవర్తి, ఆమె కుటుంబానికి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది సీబీఐ. దాంతో ఇక ఈ కేసును మూసివేస్తున్నట్టు ముంబయి స్పెషల్ కోర్టుకు నివేదికను అందజేసింది.  అయితే స్పెషల్ కోర్టు ఈ నివేదికను అంగీకరిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సుశాంత్ ఆత్మహత్యకు వారం రోజుల ముందుగా ఆయన మేనేజర్ బిల్డింగ్ పై నుండి దూకి సూసైడ్ చేసుకోవడం కూడా మిస్టరీగానే మిగిలింది. ఏదేమైన బాలీవుడ్ లో స్టార్ హీరోగా అగ్రస్థాయికి చేరుకోవాల్సిన యంగ్ హీరో ప్రస్థానం అర్దాంతరంగా ముగియడం ఒకింత బాధాకరం