సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం కూలీ. నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్, సత్యరాజ్, అమిర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు నటించిన ఈ సినిమా భారీ హైప్.. రికార్డ్ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ తో ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. కానీ మొదట అతనుండి మిశ్రమ ఫలితాన్ని రాబట్టింది కూలీ. కానీ సినిమాకు హైప్ మరియు రజినీ మాస్ ఇమేజ్ తొలి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టాయి.
Also Read : Mithra Mandali : మిత్ర మండలి రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
ఇక ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఒక తమిళ్ మినహాయిస్తే తెలుగు, కన్నడ, హిందీ, మలయాళంలో మొదటి వారం బాగా పర్ఫామ్ చేసిన కూలీ నెగిటివ్ టాక్ కారణంగా కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది. పోటీలో మారె సినిమా లేకపోవడంతో కన్నడలో బ్రేక్ ఈవెన్ మార్క్ ను అందుకుంది. రిలీజ్ అయిన 18 రోజులకు గాను ఇప్పటి వరకు కన్నడలో రూ. 44.5 కోట్ల గ్రాస్ ను రాబట్టింది కూలీ. ఈ మార్క్ తో ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన తమిళ సినిమాలలో మూడవ సినిమాగా కూలీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలానే వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. సినిమాకు వచ్చిన నెగిటివ్ టాక్ లాంగ్ రన్ ను దెబ్బతీసింది. ఫలితంగా కూలీ బ్రేక్ ఈవెన్ మార్క్ కు కాస్త దూరంలో వచ్చి ఆగింది. తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని ఏరియాలలో నష్టాలు తప్పవు.