NTV Telugu Site icon

Virata-Parvam : నేను వెన్నెల ఇది నా క‌థ

Virata

Virata

నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. ఈ సినిమాపై రోజు రోజుకు ప్రేక్ష‌కుల్లో ఆశ‌క్తి పెరుగుతోంది. గ‌త రెండు వారాల నుంచి చిత్రం నుంచి వ‌రుస అప్‌డేట్ లు రావ‌డం, ప్ర‌మోష‌న్లలో మేక‌ర్స్ సినిమా గురించి ఆస‌క్తి క‌ర విష‌యాలు చెప్ప‌డం చిత్రం పై భారీ అంచ‌నాలను న‌మోదు చేస్తున్నాయి.

న‌క్స‌లిజం నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో రానా, సాయిప‌ల్ల‌వి హీరో హీరోయిన్లుగా న‌టించారు. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న‌ ఈ చిత్రం జూన్ 17న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో చిత్ర‌బృందం వ‌రుస అప్‌డేట్‌ల‌ను ప్ర‌క‌టిస్తుంది. ఇటీవ‌లే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ వేడుక‌కు వెంక‌టేష్ గెస్ట్‌గా వ‌చ్చాడు. కాగా ఈ వేడుక‌లో ‘బ‌ర్త్ ఆఫ్ వెన్నెల’ పేరుతో వెంక‌టేష్‌ నాలుగు నిమిషాల వీడియోను విడుద‌ల చేశాడు. ఈ వీడియోలో సాయి ప‌ల్ల‌వి పుట్టుకును చూపించారు.

పురిటి నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న ఓ త‌ల్లిని ట్రాక్ట‌ర్‌లో హ‌స్పిట‌ల్‌కు తీసుకువెళ్తుంటారు. మార్గ మ‌ధ్యంలో ఓ వైపు పోలీసులు, మ‌రో వైపు న‌క్స‌లైట్స్‌లు కాల్పులు జ‌రుపుకుంటున్నారు. ఈ క్ర‌మంలో డ్రైవ‌ర్ ట్రాక్ట‌ర్‌ను ఆక్క‌డే ఆపేస్తాడు. ఇక నొప్పుల‌తో బాధ‌ ప‌డుతున్న ఆ త‌ల్లిని చూసి లేడీ న‌క్స‌లైట్ (నివేథా పేతురాజ్) పోలీసులకు ఎదురు కాల్పులు జ‌రుపుతూ ట్రాక్ట‌ర్ వ‌ద్ద‌కు వ‌చ్చి బిడ్డ‌కు పురుడు పోస్తుంది. ఆ బిడ్డ‌ని చేతిలోకి తీసుకుని వెన్నెల అని పేరు పెడుతుంది. అంత‌లోనే నివేథా త‌ల‌కు బుల్లెట్ త‌గిలి అక్క‌డిక‌క్క‌డే కుప్పకూలుతుంది.

ఒక యుద్ధం ఎన్నో ప్రాణాల‌ను తీస్తుంది. కానీ అదే యుద్ధం నాకు ప్రాణాల‌ను పోసింది. నేను వెన్నెల ఇది నా క‌థ’ అంటూ సాయి ప‌ల్ల‌వి వాయిస్ తో వీడియో ముగుస్తుంది. నాలుగు నిమిషాల వీడియోలో ఫ‌స్ట్ ప్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వ‌ర‌కు ప్ర‌తి షాట్ గూస్బంప్స్ తెప్పించాయి. ఈ వీడియోతో సినిమాపై అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి.

1990లో ఉత్త‌ర తెలంగాణ‌లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కింది. రానా న‌క్స‌లైట్ ర‌వ‌న్న పాత్ర‌లో న‌టించగా సాయి పాల్ల‌వి వెన్నెల పాత్ర‌లో న‌టించింది. న‌వీన్ చంద్ర‌, ప్రియ‌మ‌ణి, నివేథా పేతురాజ్‌, ఈశ్వ‌రీరావు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. . శ్రీల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌రా సినిమాస్, సురేష్‌ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌ల‌పై సుధాక‌ర్ చెరుకూరితో క‌లిసి సురేష్‌బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాడు.

The Birth Of Vennela | Virata Parvam IN CINEMAS JUNE 17 | Rana Daggubati | Sai Pallavi |Venu Udugula