Site icon NTV Telugu

Tollywood : ఆ సినిమా ఇన్ సైడ్ టాక్ బాగుందట

Sasivadane

Sasivadane

రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలీ ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ‘శశివదనే’. రాంకీ, రఘు కుంచె, దీపక్ ప్రిన్స్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో అహితేజ బెల్లకొండ నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో సాగే ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామా నుండి ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్, గ్లిమ్స్ ఆకట్టుకున్నాయి. స్వచ్ఛమైన గోదావరి లాంటి ప్రేమ కథను చూడబోతున్నానని భావన కలిగించింది.

Also Read : Sentiment Star : ఒక్క డిజాస్టర్ దెబ్బకు 15ఏళ్ల సెంటిమెంట్ ను పక్కన పెట్టిన స్టార్ హీరో

వాస్తవానికి ఈ సినిమా గతేడాది ఏప్రిల్ లో విడుదల కావాల్సిఉండగా అనుకోని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. కాగా ఇప్పడు ఈ సినిమాకు రిలీజ్ కు అన్ని అవాంతరాలు తొలగాయి. త్వరలోనే ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అయితే శశివదనే  సినిమాపై  టాలీవుడ్ సర్కిల్స్ లో మంచి బజ్ వినిపిస్తోంది. సినిమా బాగా వచ్చిందని ముఖ్యంగా హీరోయిన్ కోమలి ప్రసాద్ అద్భుతంగా నటించిందని ఎమోషన్ సన్నివేశాలలో ఆమె నటన కట్టిపడేస్తుందని సినిమా చూసిన కొందరి టాక్. ఇక ఈ సినిమాలోని ఐదు పాటలు అద్భుతంగా వచ్చాయి శరవణన్ వాసుదేవన్ మ్యూజిక్ మెప్పిస్తుందని అలాగే అనుదీప్ నేపధ్య సంగీతం సినిమా స్థాయిని పెంచుతుందని చెప్తున్నారు. హీరో, హీరోయిన్స్ పై సాగే లవ్ సీన్స్ చాలా కొత్తగా యూనిక్‌గా ఉంటాయి. శశి-రాఘవ ప్రేమ-ప్రకృతి తూర్పు-పడమర గోదారి రాసిన ప్రేమకథగా త్వరలో రిలీజ్ కాబోతున్న’శశివదనే’ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

 

 

Exit mobile version