Site icon NTV Telugu

Flop Heroine : ఆ ప్లాప్ హీరోయిన్ మళ్లీ వస్తోంది.. ఈ సారైనా హిట్ వస్తుందా?

Anu

Anu

మలయాళ భామలు టాలీవుడ్ వైపు పరుగులు పెడుతుంటే తెలుగులో పది సినిమాలు చేసిన అను ఇమ్మాన్యుయేల్ మాత్రం టూ ఇయర్స్ నుండి గ్యాప్ మెయిన్ టైన్ చేస్తోంది. అవకాశాలు రావట్లేదో, కావాలనే గ్యాప్ తీసుకుందో కానీ రావణాసుర తర్వాత కనిపించలేదు. కానీ సడెన్లీ సర్ ప్రైజ్ ఇచ్చింది ఈ కేరళ కుట్టీ. రష్మిక నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్‌లో కీ రోల్ పోషించబోతోంది. రష్మిక, దీక్షిత్ శెట్టి మెయిన్ లీడ్స్ కాగా.. అనూ.. దుర్గ అనే బోల్డ్ అమ్మాయి క్యారెక్టర్ చేస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ ఫిల్మ్ నవంబర్ 7న ప్రేక్షకుల ముందకు రాబోతుంది.

Also Read : Rajni – Kamal : రజనీ – కమల్ సినిమాకు స్టార్ డైరెక్టర్ ఫిక్స్

కేరళ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ కు తన ఫస్ట్ ఫిల్మ్ మజ్ను తప్ప మరో హిట్ లేదు ఆమె ఖాతాలో. తెలుగులో సుమారు పది సినిమాలు అందులోనూ సాదా సీదా హీరోలు కాదు. గ్రేడ్ వన్ హీరోలైన అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, నాని, గోపిచంద్, రవితేజ, నాగ చైతన్యలాంటి స్టార్లతో జతకట్టిన ఎక్స్ పీరియన్స్ ఆమెది. కానీ హిట్ లేకపోవడంతో ఐరన్ లెగ్ అనే ముద్ర వేసేసారు. ఇటు తెలుగులోనే కాదు, తమిళ ఇండస్ట్రీతో కూడా టూ ఇయర్స్ నుండి గ్యాప్ మెయిన్ టైన్ చేస్తుంది అనూ. జపాన్ తర్వాత మరో మూవీలో కనిపించలేదు ఈ కేరళ కుట్టీ. రీసెంట్లీ ఒప్పుకున్న ద గర్ల్ ఫ్రెండ్ మూవీ అప్డేట్ తప్ప. గర్ల్ ఫ్రెండ్‌లో కూడా రష్మికదే మెయిన్ లీడ్, అనూది జస్ట్ కీ రోల్ మాత్రమే. మరి ఈ చిన్న పాత్రైనా ఈ భామకు కలిసొచ్చి మళ్లీ తెలుగులో బిజీ అవుతుందేమో చూడాలి.

Exit mobile version