నేచురల్ స్టార్ నాని నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘ది ప్యారడైజ్’ ఒకటి. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబోలో రాబోతున్న ఈ మూవీ పై అందరిలోనూ మంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. టైటిల్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం నుంచి, ఇటీవలే నాని బర్త్ డే స్పెషల్‌గా రిలీజ్ చేసిన మూవీ గ్లింప్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఇన్నాళ్లూ పక్కింటి అబ్బాయి తరహా పాత్రల్లో కనిపించిన నాని.. ఒక్కసారిగా రెండు జడల హెయిర్ స్టైల్ తో ఊర మాస్ లుక్‌లో షాక్ ఇచ్చాడు. దీంతో నాని లుక్ మీద నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇక సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికను ఇంకా ప్రకటించలేదు. కానీ తాజాగా ఈ మూవీ బాలీవుడ్ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
అనతి కాలంలోనే హిందీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సోనాక్షి సిన్హా గురించి పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నా ఈ బ్యూటీ ఆల్‌ర్రేడి సుధీర్ బాబు కెరీర్‌లో భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ‘జటాధర’ చిత్రంలో నటించబోతుంది. అయితే తాజాగా సోనాక్షి సిన్హాని ‘ది ప్యారడైజ్’ లో ఓ కీలక పాత్ర కోసం అప్రోచ్ అయినట్లు సమాచారం. ఆమె కూడా ఈ సినిమాలో నటించడానికి అంగీకరించిందట. అంతేకాదు ఈ మూవీలో సోనాక్షి సిన్హా పై ఓ స్పెషల్ సాంగ్‌ను కూడా షూట్ చేయనున్నారట. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కాగా అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం మాస్ ప్రేక్షకులకు పక్కా ఫుల్ మీల్స్‌లా ఉంటుందట.