Site icon NTV Telugu

Tharun Bhascker : సొంత సినిమాపైనే తరుణ్ భాస్కర్ సెటైర్.. ‘పెళ్లి చూపులు’ యావరేజ్ అట! ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ రచ్చ!

Tarunbaskar

Tarunbaskar

నేటి జనరేషన్ పల్స్ తెలిసిన దర్శకుడు తరుణ్ భాస్కర్, ఇప్పుడు నటుడిగా తన సత్తా చాటేందుకు ‘గాయపడ్డ సింహం’తో వస్తున్నారు. టీజర్ ట్రైలర్‌తోనే ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. ఇటీవలే ‘ఓం శాంతి శాంతి శాంతి’తో హీరోగా పలకరించిన ఆయన, ఈసారి పక్కా కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో హిట్టు కొట్టాలని కంకణం కట్టుకున్నారు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ‘చిట్టి’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. అమెరికా వెళ్లాలనే బలమైన కోరిక ఉన్న ఒక యువకుడి చుట్టూ తిరిగే ఈ కథలో తరుణ్ కామెడీ టైమింగ్ అద్భుతంగా కుదిరింది. అయితే,

Also Read  : RGV: పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్? దేశ భవిష్యత్తుతో ఆటలాడొద్దు – ఆర్జీవీ

ట్రైలర్ మొత్తానికి హైలైట్ ఏమిటంటే.. తరుణ్ భాస్కర్ తన కెరీర్‌ను మలుపు తిప్పిన ‘పెళ్లి చూపులు’ సినిమాపైనే సెటైర్ వేసుకోవడం. “పెళ్లి చూపుల గురించి మీ అభిప్రాయం ఏంటి?” అని అడిగితే.. “ఓ యావరేజ్ సినిమా” అని తరుణ్ చెప్పే డైలాగ్ చూసి నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రంపై ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఒక దర్శకుడిగా తరుణ్ భాస్కర్‌కు ఉన్న క్రేజ్, ఇప్పుడు హీరోగా ఈ సినిమాకు ఏ స్థాయిలో వసూళ్లు తెచ్చిపెడుతుందో చూడాలి.

 

Exit mobile version