Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?

Tharun Bhascker

Tharun Bhascker

Tharun – Eesha: టాలీవుడ్‌లో సరికొత్త లవ్ బర్డ్స్‌గా మారిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బ మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. గత కొద్దికాలంగా వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ గుసగుసలు వినిపిస్తున్న వేళ, తాజా ఫోటోలు ఈ రూమర్లకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది. వినాయక చవితి పర్వదినాన్ని ఈ జంట కలిసి జరుపుకోవడంతో, “ఇది కేవలం హింటా? లేక తమ బంధంపై అధికారిక క్లారిటీ ఇస్తున్నారా?” అంటూ సినీ ప్రియులు, నెటిజన్లు ఆసక్తికర చర్చకు తెరతీశారు. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ ఇటీవల ఫిలింనగర్ సర్కిల్స్‌లో జోరుగా చర్చ సాగింది. అయితే తమ వ్యక్తిగత విషయాలపై ఇద్దరూ ఎక్కడా ఓపెన్‌గా మాట్లాడలేదు. కానీ తాజాగా వీరిద్దరూ కలిసి వినాయక చవితి వేడుకల్లో జంటగా పాల్గొనడం, ఆ ఫోటోలు బయటకు రావడంతో అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

తరుణ్ భాస్కర్ హీరోగా, ఈషా రెబ్బ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘ఓం శాంతి శాంతిః’. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని, అది కాస్తా ప్రేమగా మారిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. బయట పలు సందర్భాల్లోనూ వీరు జంటగా కెమెరాల కంటికి చిక్కడంతో డేటింగ్ వార్తలు మరింత ఊపందుకున్నాయి. అయితే గతంలో ఈషా రెబ్బ ఓ ఇంటర్వ్యూలో వారి బంధం గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. “మా నాన్న కూడా ఈ వార్తలు చూసి పెళ్లెప్పుడు అని అడుగుతున్నారు. ఆ పెళ్లి వార్తల్లో నిజం లేదు కానీ.. ప్రస్తుతం నేను ఒకరితో డేటింగ్ (ఐ యామ్ సీయింగ్ సం వన్) చేస్తున్నాను. అయితే ఆ రిలేషన్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉంది. అప్పుడే పెళ్లి ఆలోచనలు లేవు” అంటూ ఒప్పుకున్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం ఆమె సీక్రెట్‌గా ఉంచారు. ఇప్పుడు ఏకంగా పండుగలను సైతం కలిసి జరుపుకుంటుండటంతో, ఈషా రెబ్బ మనసు దోచుకున్న ఆ వ్యక్తి కచ్చితంగా తరుణ్ భాస్కరేనని అభిమానులు ఫిక్స్ అయిపోతున్నారు. ఎలాంటి దాపరికాలు లేకుండా ఒకే ఫ్రేమ్‌లో ఇలా కనిపించడం చూస్తుంటే, త్వరలోనే తమ బంధాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేసి పెళ్లి కబురు చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదని టాలీవుడ్ టాక్.