Site icon NTV Telugu

Thammudu : ఇదేంటి దిల్ రాజు ఇలా ఓపెన్ అయ్యాడు?

Dilraj

Dilraj

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘తమ్ముడు’. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తుండగా, జూలై 4న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఇక ప్రమోషన్ లో భాగంగా తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ఘనంగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి..

Also Read : Laya : నా సొంతింటికి తిరిగి వచ్చినట్లు ఉంది..

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘మా సంస్థలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత ‘తమ్ముడు’ రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేద్దామా అని ఎదురుచూశాం. ఈ సినిమా కోసం డైరెక్టర్ శ్రీరామ్ వేణు నాలుగేళ్లు కష్టపడ్డాడు. ఈ కథ అనుకున్నప్పుడే విజువల్, సౌండింగ్ కొత్తగా ఉండేలా డిజైన్ చేస్తానని శ్రీరామ్ చెప్పాడు. అన్నట్లుగానే చాలా కష్టపడి చేశాడు. ట్రైలర్ చూశాక.. మీ అందరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రేపు థియేటర్‌లోనూ ఇదే రెస్పాన్స్ వస్తుందని ఉంటుందని నమ్ముతున్నాం. లయ గారు మా సంస్థ ద్వారా మళ్లీ ఇండస్ట్రీకి రావడం హ్యాపీగా ఉంది. నితిన్‌కు తమ్ముడు మూవీ చాలా ఇంపార్టెంట్. ట్రైలర్ బాగుందంటూ మన మీడియా మిత్రుల నుంచి ఫోన్స్ , మెసేజెస్ వస్తున్నాయి. మేము ఎగ్జామ్ రాశాం. జూలై 4 న రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. కచ్చితంగా మా మూవీ ఆడియెన్స్‌కు నచ్చుతుందని నమ్ముతున్నాం..’ అని తెలిపాడు. అలాగే..

Also Read : Nikhil : హీరో నిఖిల్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం..

‘ఈ రోజు ప్రేక్షకుల్ని థియేటర్స్‌కు తీసుకురావడం కష్టంగా మారింది. గత ఆరు నెలల్లో నాలుగైదు సినిమాలు మాత్రమే ఆదరణ పొందాయంటే థియేట్రికల్‌గా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. తెలుగు సినిమా నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఈ పొజిషన్‌ను కాపాడాలంటే అందరం కష్టపడాలి. అలాగే నేను ఎప్పటి నుండో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. యూట్యూబ్‌లో రిలీజ్ చేసాము.. అక్కడ వచ్చే నంబర్స్ ఉంటాయి కదా అన్ని ఒరిజినల్, ప్రేక్షకులు చూస్తున్న నంబర్లు అక్కడ ఉండాలని మా ఆఫీస్ లో నా పి ఆర్ టీ టీం అందరిని అలర్ట్ చేశా. వ్యూస్‌ని డబులు పెట్టి కొనుకొకండి. ఎందుకంటే ప్రతి సినిమాను జెన్యూన్ గా ఆడియన్స్ ముందుకు తీసుకెళ్లాలి. అందుకు మీడియా మిత్రుల సపోర్ట్ కూడా కావాలి’ అని అన్నారు దిల్ రాజు.

Exit mobile version