Site icon NTV Telugu

Exclusive : తమ్ముడు ఎఫెక్ట్.. ‘ఎల్లమ్మ’ నితిన్ తో డౌటే

Nihiin

Nihiin

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ బ్యాక్ టు బ్యాక్ ప్లాపులతో దూసుకెళ్తున్నాడు. చెక్, ఎక్సట్రార్డినరీ మెన్, రాబిన్ హుడ్ ఒకదానికి ఒకటి భారీ ప్లాప్స్. ఇక   దిల్ రాజు బ్యానర్ లో నితిన్ ఎంతో నమ్మి, ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ్ముడు దారుణమైన ప్లాప్. కనీసం మినిమమ్ ఓపెనింగ్ కూడా రాబట్టలేక నితిన్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది.

Also Read : Prabhas : ఎన్నాళ్లకు డార్లింగ్.. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ప్రభాస్

తమ్ముడు రిజల్ట్ నితిన్ కెరీర్ పై ఎఫెక్ట్ చూపే అవకాశం గట్టిగానే కనిపిస్తోంది. నితిన్ నెక్ట్స్ సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లోనే చేయాల్సి ఉంది. బలగం వేణు దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘ఎల్లమ్మ’ అనే టైటిల్ తో చాలా కాలం క్రిత్తం ఓ సినిమా ఫిక్స్ అయింది. కాని నితిన్ రాబిన్ హుడ్, తమ్మడు కమిట్మెంట్స్ కారణంగా డిలే అవుతూ వస్తుంది. ఈ సినిమాకు కాస్త భారీగానే బడ్జెట్ అవుతుందట. ఇప్పుడు నితిన్ పై అంత బడ్జెట్ పెట్టేందుకు నిర్మాత దిల్ రాజు కాస్త ముందు వెనక ఆలోచన చేస్తున్నారట. తమ్ముడు వరల్డ్ వైడ్ గా కేవలం రూ. 3.50 కోట్లు మాత్రమే రాబట్టింది. దాంతో నితీన్ తో ఇప్పుడు రిస్క్ ఎందుకు అనే భావనలో దిల్ రాజు  ఉన్నట్టు టాలీవుడ్ లో న్యూస్ హాల్ చల్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ను మరికొంత కాలం వాయిదా వేసే ఆలోచనలో కూడా ఉన్నారట. ఈ వార్తలపై మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి. వాస్తవానికి ఎల్లమ్మ సినిమాను మొదట నానితో అనుకుని చివరికి నితిన్ కు చేరింది. ఏదేమైనా తమ్ముడు సినిమా నితిన్ కు మరవలేని చేదు అనుభవాన్ని మిగిలిచింది.

Exit mobile version