Thaman: త్రివిక్రమ్ వల్లే ‘ఓజీ’ సాధ్యమైంది: మ్యూజిక్ డైరెక్టర్ తమన్

Thaman

Thaman

Thaman: మల్లారెడ్డి కాలేజీలో జరిగిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వేదికపై తనదైన సరదా వ్యాఖ్యలతో నవ్వులు పూయించిన తమన్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ గురించి చేసిన కామెంట్స్ ప్రత్యేకంగా అభిమానుల దృష్టిని ఆకర్షించాయి.

ఈ వేడుకలో తమన్ మాట్లాడుతూ.. “అభిమానులు ఎప్పుడు ‘ఓజీ’ అన్నా నాకు త్రివిక్రమ్ సర్ గుర్తుకొస్తారు. అసలు ‘ఓజీ’ ప్రాజెక్ట్ మొదలైంది, సాధ్యమైంది కేవలం త్రివిక్రమ్ సర్ వల్లే. నా జీవితంలో ఆయన ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానంలో ఉంటారు” అని వెల్లడించారు. అలాగే విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ.. “నాకు ఎప్పుడు బోర్ కొట్టినా వెంటనే చూసే సినిమా ‘నువ్వు నాకు నచ్చావ్’. ఇప్పటికీ భోజనం చేసేటప్పుడు యూట్యూబ్‌లో ఆ సినిమా చూస్తూనే ఉంటాను. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో ‘అరవింద సమేత’కి పనిచేయాలనే డ్రీమ్ ఎలా తీరిందో.. ఇప్పుడు వెంకీ-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాకు పనిచేయడం అంతే సంతోషాన్ని ఇచ్చింది. ఇందులో వెంకీ మామ, త్రివిక్రమ్ గారి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది” అని చెప్పారు.

సినిమాలోని మ్యూజిక్ విశేషాలను పంచుకుంటూ.. ఇప్పటికే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వర్క్ మొత్తం పూర్తయిందని, ఇందులో దాదాపు ఏడు ప్రత్యేకమైన సాంగ్స్ ఉంటాయని తెలిపారు. వాటన్నింటినీ ఒక ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ రూపంలో పక్కాగా విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా థియేటర్లలో కచ్చితంగా బ్లాక్‌బస్టర్ విజయం సాధిస్తుందని తమన్ పూర్తి ధీమా వ్యక్తం చేశారు.