NTV Telugu Site icon

Thaman : ఉప్పల్ స్టేడియంలో తమన్ మ్యూజికల్ ఈవెంట్..

Taman

Taman

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. వరుస పాన్ ఇండియా సినిమాలతో తెలుగు, తమిళం అనే తేడా లేకుండా తన మ్యూజిక్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్నారు. మెలోడీ, మాస్ బీట్స్‌తో శ్రోతలను ఉర్రూతలూగిస్తుంటారు. ఇప్పటికే తమన్ మ్యూజిక్ అందించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బ్లాస్ట్ అవ్వగా.. త్వరలోనే పవన్ కళ్యాణ్‌ ‘ఓజీ’, ప్రభాస్ ‘రాజాసాబ్’, రవితేజ ‘RT4GM’, అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబో తెరకెక్కనున్న ‘AA22’ మూవీకి తమన్ సంగీతం అందించనున్నారు. వీటితోపాటు తమిళ సినిమాలతో కూడా ఆడియన్స్‌ను అలరించనున్నారు. ఇలా వరుస సినిమాలతో తీరిక లేకుండా బిజీగా ఉండే తమన్‌ తాజాగా మరో అవకాశం దక్కించుకున్నాడు.

Also Read: Manchu Vishnu : పూర్తిగా శివ భక్తుడిగా మారాను

దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ వచ్చేసింది. మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. కాగా 27న రాత్రి 7:30 కి ఉప్పల్ లో లక్నోతో సన్ రైజర్స్ మ్యాచ్ ఉంది. అయితే ఈ మ్యాచ్ కు వచ్చే ప్రేక్షకుల కోసం, మ్యాచ్ ప్రారంభానికి ముందు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. దేశవ్యాప్తంగా ఐపీఎల్ జరుగుతున్న పలు స్టేడియాల్లో మ్యాచ్‌కు ముందు ఇదే తరహాలో మ్యూజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్న బీసీసీఐ.