Thaman: ఇదే నా లాస్ట్ సినిమా: తమన్

Ss Thaman

Ss Thaman

Thaman: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌ఎస్ తమన్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో మోస్ట్ బిజీయెస్ట్ టెక్నీషియన్‌గా దూసుకుపోతున్నారు. అయితే సంగీత దర్శకుడిగానే కాకుండా, ఆయన త్వరలోనే నటుడిగానూ వెండితెరపై మెరవబోతున్నారు. తమన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఒక తమిళ చిత్రం ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతుంది. ఈ క్రమంలో తాజాగా తన యాక్టింగ్ కెరీర్‌పై తమన్ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

ఆ సినిమా ఎలా ఒప్పుకున్నానో నాకే తెలియదు..

థమన్ మాట్లాడుతూ.. “నిజం చెప్పాలంటే అసలు ఆ సినిమా చేయడానికి నేను ఎలా ఒప్పుకున్నానో నాకే తెలియదు. ఆ దర్శకుడు నా దగ్గరకు వచ్చి కథ చెప్పినప్పుడు, నేను ఆ కథ వింటూ మైమరపులోకి వెళ్లిపోయాను. ఆయన నన్ను ఎలా ఒప్పించాడో కూడా నాకు గుర్తు లేదు. అలా ఆ ప్రాజెక్టులోకి వెళ్ళిపోయాను” అని చెప్పుకొచ్చారు. సినిమాల్లో నటించడంపై తనకున్న అభిప్రాయాన్ని పంచుకుంటూ.. ఇకపై యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పేయబోతున్నట్లు తమన్ క్లారిటీ ఇచ్చారు. “నిజజీవితంలో ఎలాగో మనం నిత్యం నటిస్తూనే ఉంటాం. కానీ, సినిమాల్లో కూడా నటించడం అంటే చాలా కష్టం. అందుకే నేను ఇప్పుడు నటిస్తున్న తమిళ సినిమా కాకుండా.. భవిష్యత్తులో మరే ఇతర సినిమాలోనూ నటించకూడదని నిర్ణయించుకున్నాను. ఇదే నా చివరి సినిమా” అని తమన్ స్పష్టం చేశారు. ఈ క్రేజీ తమిళ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న తమన్, నటుడిగా వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

×
×
Ad