Thaman: ఇదే నా లాస్ట్ సినిమా: తమన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thaman: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో మోస్ట్ బిజీయెస్ట్ టెక్నీషియన్‌గా దూసుకుపోతున్నారు. అయితే సంగీత దర్శకుడిగానే కాకుండా, ఆయన త్వరలోనే నటుడిగానూ వెండితెరపై మెరవబోతున్నారు. తమన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఒక తమిళ చిత్రం ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతుంది. ఈ క్రమంలో తాజాగా తన యాక్టింగ్ కెరీర్‌పై తమన్ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
ఆ సినిమా ఎలా ఒప్పుకున్నానో నాకే తెలియదు..
థమన్ మాట్లాడుతూ.. “నిజం చెప్పాలంటే అసలు ఆ సినిమా చేయడానికి నేను ఎలా ఒప్పుకున్నానో నాకే తెలియదు. ఆ దర్శకుడు నా దగ్గరకు వచ్చి కథ చెప్పినప్పుడు, నేను ఆ కథ వింటూ మైమరపులోకి వెళ్లిపోయాను. ఆయన నన్ను ఎలా ఒప్పించాడో కూడా నాకు గుర్తు లేదు. అలా ఆ ప్రాజెక్టులోకి వెళ్ళిపోయాను” అని చెప్పుకొచ్చారు. సినిమాల్లో నటించడంపై తనకున్న అభిప్రాయాన్ని పంచుకుంటూ.. ఇకపై యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పేయబోతున్నట్లు తమన్ క్లారిటీ ఇచ్చారు. “నిజజీవితంలో ఎలాగో మనం నిత్యం నటిస్తూనే ఉంటాం. కానీ, సినిమాల్లో కూడా నటించడం అంటే చాలా కష్టం. అందుకే నేను ఇప్పుడు నటిస్తున్న తమిళ సినిమా కాకుండా.. భవిష్యత్తులో మరే ఇతర సినిమాలోనూ నటించకూడదని నిర్ణయించుకున్నాను. ఇదే నా చివరి సినిమా” అని తమన్ స్పష్టం చేశారు. ఈ క్రేజీ తమిళ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న తమన్, నటుడిగా వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!