Site icon NTV Telugu

Vijay Sethupathi : ‘తలైవన్ తలైవి’ టైటిల్ టీజర్ రిలీజ్..!

Vijay

Vijay

త‌మిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ట్యాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్ కలిసి జంటగా ఓ సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు మేక‌ర్స్. తాజాగా ఈ సినిమాకు ‘తలైవన్ తలైవి’ అనే టైటిల్‌ను ప్రకటిస్తూ చిత్రబృందం ఓ టీజర్‌ను విడుదల చేసింది. తమిళంలో ‘తలైవన్’ అంటే నాయకుడు అని, ‘తలైవి’ అంటే నాయకురాలు అని అర్థం.

Also Read : Chiranjeevi : ‘విశ్వంభర’ నుంచి త్రిష లుక్ రివిల్.. !

కాగా ఈ టీజ‌ర్‌లో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ మధ్య ఉండే కెమిస్ట్రీని చూపించారు మేక‌ర్స్. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి ఎం సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వీరసమర్ ఆర్ట్ డైరెక్టర్, ప్రదీప్ ఇ.రాఘవ్ ఎడిటింగ్ చేస్తున్నారు. యోగి బాబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి స్టంట్స్ కలై కింగ్సన్ అందిస్తున్నారు. టైటిల్ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. నిత్య ఇంకా విజయ్ మధ్య కెమిస్ట్రీ బాగా హైలెట్ అయ్యింది.

 

Exit mobile version