సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై యాక్టివ్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరుగా ఉన్న టీజీ విశ్వప్రసాద్ స్పందించారు. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఈ సమస్య మీద తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నిజానికి తమకు వేతనాలు పెంచి ఇచ్చే విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్న ఆయన, స్కిల్డ్ వర్కర్స్ లేనప్పుడు ఇప్పుడు ఇస్తున్న వేతనాలే ఇబ్బందికరంగా అనిపిస్తోందని అన్నారు. అలాంటిది స్కిల్ లేకుండా ఇప్పుడు ఇంకా జీతాలు పెంచి వాళ్లకు ఇవ్వడం నిర్మాతలకు తలకు మించిన భారంగా మారుతుందని అన్నారు. సినీ పరిశ్రమలో కొన్ని క్రాఫ్ట్స్ వాళ్లు రోజుకి వచ్చి గంటే పని చేస్తారని, కానీ వాళ్లకు మిగతా వాళ్లతో సమానంగా వేతనాలు ఇస్తున్నామని అన్నారు. మన దగ్గర టాలెంట్ ఉండి కూడా ఆయా యూనియన్స్‌లో చేరితేనే సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారని, ఒకవేళ డబ్బులు కట్టడానికి రెడీగా ఉన్నా కూడా ఐదు ఆరు నెలల సమయం పడుతుందని అన్నారు.
Also Read : Jr NTR : ఫ్యామిలీ లెగసీపై ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకు ఉదాహరణగా డాన్సర్స్ యూనియన్‌ని ఆయన ప్రస్తావించారు. ఎవరైనా రికమెండ్ చేసినా కూడా యూనియన్ కార్డు లేకపోతే షూటింగ్ జరపనివ్వరని ఆయన అన్నారు. మన దగ్గర స్కిల్డ్ డాన్సర్స్ ఉన్నారు కానీ వాళ్లు యూనియన్‌లో మెంబర్స్ కారు కాబట్టి ముంబై యూనియన్ నుంచి స్కిల్డ్ డాన్సర్స్ తీసుకొస్తున్నామని, వాళ్లకు అత్యధిక వేతనాలు ఇవ్వాల్సి వస్తోందని అన్నారు. కాబట్టి ఈ స్ట్రక్చర్ మార్చాలనే ఉద్దేశం అందరూ నిర్మాతలకు వచ్చిందని ఆయన అన్నారు. సినీ పరిశ్రమ ఒక మాఫియా లాగా అవినీతికి అడ్డాగా మారిందని తాను గతంలోనే పేర్కొన్నానని ఆయన అన్నారు. ఇప్పుడు అందరికీ అది అర్థమైనట్లు వెల్లడించారు.
Also Read : Janaki V vs State of Kerala: : ఓటీటీలోకి వివాదస్పద సినిమా.. ఎప్పుడంటే?
తాను ప్రస్తుతం మూడు సినిమాల షూటింగ్స్ చేస్తున్నామని, సోమవారం నుంచి షూటింగ్‌కి రామని ఆదివారం సాయంత్రం నోటీసులు ఇవ్వడం వల్ల తాను లీగల్ నోటీసులు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. సినీ కార్మికులకు ఎలా అయితే 30% వేతనం పెంచితేనే షూటింగ్‌కి వస్తామని చెప్పే హక్కు ఉందో, తమకు నచ్చిన వాళ్ల చేత పని చేయించుకునే హక్కు తమకు కూడా ఉందని అన్నారు. ఒకవేళ వాళ్లు షూటింగ్ అడ్డుకునే ప్రయత్నం చేస్తే అది చట్ట ప్రకారం నేరమని అన్నారు.
