డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో యూత్‌లో యమా క్రేజ్ సంపాదించుకున్నాడు యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఇదే జోష్‌లో బొమ్మరిల్లు భాస్కర్‌తో జాక్ అనే సినిమా చేశాడు. కానీ జనాలకు క్రాక్ తెప్పించే రిజల్ట్ అందుకుంది జాక్. దీంతో.. బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. అందుకే.. అర్జెంట్‌గా ఒక హిట్ కొట్టి తానేంటో మరోసారి ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు సిద్ధు. ఈ నేపథ్యంలో.. ‘తెలుసు కదా’ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. నీరజ కోన దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అక్టోబర్ 17న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
Also Read:Tollywood : ఇదేం జర్నలిజం? ఇలాంటి ప్రశ్నలు అవసరమా?
ఇక ఈ ట్రైలర్ చూసిన తర్వాత.. సిద్ధు నుంచి ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో.. అది సినిమాలో ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో అన్ని ఎక్కువే అన్నట్టుగా ట్రైలర్ కట్ చేశారు. సిద్ధు మార్క్ డైలాగ్స్, రొమాంటిక్ సీన్స్ బోలెడు ఉన్నట్టుగా చూపించారు. శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా గ్లామర్ ట్రీట్ యూత్‌ని ఎట్రాక్ట్ చేసేలా ఉంది. కాకపోతే.. ఈ ట్రైలర్ మొత్తం నలుగురి చుట్టే తిరిగింది. హీరో, హీరోయిన్లతో పాటు.. వైవా హర్షను మాత్రమే ట్రైలర్‌లో హైలెట్ చేశారు. అక్కడక్కడ కొన్ని ఫ్రేమ్స్‌లో మరికొన్ని క్యారెక్టర్స్ చూపించినా.. డైలాగ్స్ ఉండవు. ట్రైలర్ మొత్తం సిద్ధు వన్ మ్యాన్ షో అన్నట్టుగానే ఉంది. సిద్ధు డైలాగ్స్ చూస్తే.. మధ్య మధ్యలో టిల్లుగాడు వచ్చి వెళ్లినట్టుగా కూడా అనిపిస్తుంది. అయితే.. ట్రైలర్ లాస్ట్‌లో ఒక డైలాగ్ ఉంది. అది.. ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. మొత్తంగా.. తెలుసు కదా ట్రైలర్ మాత్రం సిద్ధు మార్క్‌తో సాగింది. మరి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ఉంటుందో చూడాలి.