Site icon NTV Telugu

Tollywood : టెన్షన్ పడుతున్న తెలుగు హీరోయిన్.. కారణం ఇదే

Sri Gouri

Sri Gouri

తమిళ ఇండస్ట్రీలో ఫ్రూవ్ చేసుకుంటేనే కానీ తెలుగమ్మాయికి టాలీవుడ్‌లో సరైన గుర్తింపు దక్కడం లేదా అంటే.. సమ్ టైమ్స్ నిజమే అనిపించకమానదు. అంజలి, శ్రీదివ్య నుండి ఆనంది, ఐశ్వర్య రాజేష్ వరకు మాత్రమే కాదు.. ఇప్పుడు ఈ పదాహరణాల తెలుగు ఆడపడుచు శ్రీగౌరి ప్రియ ఈ కోవలోకే వస్తుంది. మ్యాడ్ కన్నా ముందు అరడజనుకు పైగా చిత్రాల్లో నటించినా ఐడెంటిటీ రాలేదు కానీ ఎప్పుడైతే ట్రూ లవర్‌తో రిజిస్టర్ అయ్యిందో మేడమ్ ఫేట్ మారిపోయింది.

Also Read : Exclusive : బాహుబలి రీరిలీజ్.. రన్ టైమ్ కోసం రంగంలోకి రాజమౌలి

ట్రూ లవర్ కన్నా ముందే మ్యాడ్‌లో ఓకే అనిపించినా అందులో కూడా గౌరీ ప్రియది సెకండ్ హీరోయిన్ క్యారెక్టరే. అంతకు ముందు లవ్ స్టోరీ, శ్రీకారం, రైటర్ పద్మభూషణ్, ఓటీటీ ఫిల్మ్స్ చేసినప్పటికీ తాను చేసిందన్న విషయం ఆమెకు తప్పితే మరొకరికి తెలియదు. తమిళంలో మోడరన్ లవ్ చెన్నైతో కోలీవుడ్ తెరంగేట్రం చేసిన భామ ట్రూ లవర్‌తో ఫ్రూవ్ చేసుకోవడంతో టాలీవుడ్ పిలిచి పిల్లకు ఆఫర్లు ఇస్తోంది.ఇప్పటికే కిరణ్ అబ్బవరం సరసన చెన్నై లవ్ స్టోరీ చేస్తుండగా ఇప్పుడు నాగవంశీ ప్రొడక్షన్ హౌస్‌లో తెరకెక్కుతోన్న వింటావా సరదాగాలో నటిస్తోంది. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తోన్న ధర్డ్ ఫిల్మ్ వింటావా సరదాగా. మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లిన తెలుగు యువతీయువకులకు సంబంధించిన స్ట్రగుల్స్, ఫ్రెండ్ షిప్‌తో పాటు ప్రేమ కథను చూపించబోతున్నారు. ఇందులో అశోక్ సరసన జోడీ కడుతోంది గౌరీ ప్రియా. ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్ చేయని ఈ తెలుగుమ్మాయి ఈ సినిమాలో లిప్ లాక్, ఇంటిమసీ సీన్లలో కనిపించింది. కానీ ఇక్కడ  హిట్స్ ఉంటేనే మరిన్ని సినిమా అవకాశాలు వస్తాయని గుర్తుపెట్టుకుని సినిమాలు చేయాలి.

Exit mobile version