Site icon NTV Telugu

Tollywood: త్వరలో టాలీవుడ్ కీలక సమావేశం

Tollywood

Tollywood

రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో పర్సంటేజీ విధానం లెక్కన సినిమాలాడించాలా లేక రెంటల్ విధానం లెక్కన ఆడించాలా అనే విషయం మీద కొన్ని ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్లందరూ ఖచ్చితంగా పర్సంటేజీ విధానంలోనే సినిమాలు ఆడించాలని లేదంటే థియేటర్లో మూసేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఒక కమిటీ కూడా ఏర్పాటు అయింది.

Also Read:Icon Movie : బన్నీ వదిలేసిన ‘ఐకాన్’.. కొత్త హీరో అతనేనా..?

ఈ కమిటీలో సభ్యులుగా కేఎల్ దామోదర ప్రసాద్, దిల్ రాజు, ప్రసన్నకుమార్, సి కళ్యాణ్, రవికిషోర్, రవిశంకర్, నాగవంశీ, దానయ్య, స్వప్న, సుప్రియ ఉన్నారు. వీరు నిర్మాతలు కాగా డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ నుంచి భరత్ భూషణ్, సుధాకర్ రెడ్డి, శిరీష్ రెడ్డి, మైత్రి శశి, ఎల్విఆర్, ముత్యాల రామదాసు, నాగార్జున, సీడెడ్ కుమార్, భరత్ చౌదరి వంటి వారు ఉన్నారు.

Also Read:Naga Babu: నిహారిక విడాకులు.. మేం చేసిన తప్పే!

ఎగ్జిబిటర్ సెక్టర్ నుంచి రాంప్రసాద్, దగ్గుబాటి సురేష్ బాబు, సునీల్ నారంగ్ సహా మొత్తం పదిమంది ఉన్నారు. ఏకంగా 30 మంది సభ్యులు ఉన్న ఈ కమిటీ ఈనెల 29వ తేదీన హైదరాబాద్ తెలుగు ఫిలిం ఛాంబర్ హాల్ లో సమావేశం కాబోతోంది. ప్రధాన సమస్యలతో పాటు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఈ మీటింగ్ లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ప్రధాన అజెండా మాత్రం ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్న పర్సంటేజీ విధానం మీదే జరగబోతోంది. చూడాలి ఏం జరగబోతోంది అనేది.

Exit mobile version