OG : తెలంగాణలో టికెట్ రేట్లు తగ్గింపు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనేక చర్చలు, వివాదాలు, కోర్టు కేసుల అనంతరం ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం ఓజి సినిమాకి సంబంధించి పెంచిన రేట్లు తగ్గించి అమ్మాలంటూ ఒక మోస్ట్ అర్జెంట్ ఆర్డర్‌ని రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఓజి సినిమా రిలీజ్‌కి ముందు టికెట్ రేట్లు పెంచి అమ్ముకుంటామని ప్రభుత్వాన్ని అనుమతి కోరగా ప్రభుత్వం దానికి అనుమతించింది. ఈ మేరకు ఒక జీవో కూడా జారీ చేసింది. అయితే ఆ జీవోని సస్పెండ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అయినా సరే, చాలా చోట్ల పెంచిన రేట్లు అమ్మకాలు జరిగాయి. అయితే తాజాగా ఆ విషయంలో శ్రద్ధ తీసుకుని పెంచిన రేట్లు కాకుండా తెలంగాణలో అనుమతించిన రేట్లకే అమ్మకాలు జరపాలంటూ ప్రభుత్వం నుంచి ఒక ఆర్డర్ రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది.
Also Read :Traffic Challan : చెప్పులు వేసుకొని బైక్ నడిపితే జరిమానా..?
Also Read
- PEDDI : పెద్ది ఓవర్శీస్ టాక్.. కొంచం ఇష్టం.. కొంచం కష్టం
- Upasana Konidela: ‘పెద్ది’ థియేటర్లో మెగా కోడలి ఊరమాస్ రచ్చ.. చరణ్ ఎంట్రీకి పేపర్లు ఎగరేసిన ఉపాసన!
- Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
దీని ప్రకారం ఓ.జి. సినిమాకి మల్టీప్లెక్స్‌లకు 295 లకు సింగిల్ స్క్రీన్స్‌కి బాల్కనీ 175, లోయర్ క్లాస్ 110 రూపాయలకి అమ్మకాలు జరపాల్సి ఉంటుంది. నిజానికి ఓజి సినిమాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో కూడా పెంచుకుని అమ్ముకునేలా జీవో జారీ చేశారు. కాకపోతే అక్కడ ఎవరూ కోర్టుకు వెళ్లకపోవడంతో పెంచిన రేట్లు అమ్మకాలు జరిగాయి. కాకపోతే డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు స్వచ్ఛందంగా మినిమం రేటుకే అమ్మకాలు జరపడం మొదలుపెట్టారు. ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం జోక్యం చేసుకుని ఒక ఆర్డర్ రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓజి కలెక్షన్స్ మరింత ఊపొందుకునే అవకాశం ఉంది. కాకపోతే మరొక రెండు రోజుల్లో రెండు డబ్బింగ్ సినిమాలు కూడా థియేటర్లలోకి రాబోతున్నాయి. ఆ ఎఫెక్ట్‌తో ఈ కలెక్షన్స్ ఎంతవరకు రావచ్చు అనేది ప్రస్తుతానికి చెప్పలేని పరిస్థితి.
తాజావార్తలు
-
Dhurandhar 2: ఈ రోజు ఓటీటీలోకి స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’… ప్రశంసలు కురిపించిన అంబానీ.!
-
Vaibhav-MS Dhoni: ఎంఎస్ ధోనీ కాదు బిహార్‌కు గుర్తింపు వైభవ్ వల్లే.. ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Bank Account: ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండొచ్చు? ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా? నష్టమా?
-
Aadhaar Mobile Number Update: ఆధార్‌లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్‌డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
-
PEDDI : పెద్ది ఓవర్శీస్ టాక్.. కొంచం ఇష్టం.. కొంచం కష్టం
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!